- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సేఫ్టీ నైబర్‌హుడ్ తో తగ్గుతున్న బరువు
దిశ, ఫీచర్స్: బరువు తగ్గడానికి ఆహార నియమాలు, ఎక్సర్ సైజులు దోహదపడతాయని అందరికీ తెలిసిందే. కానీ సురక్షితమైన పొరుగు ప్రాంతం(safer neighborhood) కూడా అందుకు దోహదం చేస్తుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. జిమ్ లేదా కిరాణా దుకాణానికి మీ ఇల్లు ఎంత దగ్గరగా ఉందో, దాని కంటే సురక్షితమైన పరిసరాల్లో నివసించడం బరువు తగ్గడంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందట. సరిపోని వీధి దీపాలు, సంచరించే పిల్లల సమూహాలు, భారీ ట్రాఫిక్ వంటి అంశాలు బరువు తగ్గడంలో ఇబ్బందులతో సంబంధం కలిగి ఉన్నాయని కూడా పరిశోధకులు చెప్తున్నారు.
ఆహార నియంత్రణ, వ్యాయామం, లైఫ్ట్ స్టైల్ చేంజింగ్ వంటివి ఊబకాయాన్ని పరిష్కరించడంలో కీలకమైనవి అయినప్పటికీ, బరువు తగ్గడంపై పొరుగువారి లేదా, ఇరుగు పొరుగు పరిసరాల ఎఫెక్ట్ ఉంటుందని నూతన అధ్యయనం తెలియజేసింది. ఒబేసిటీతో జీవిస్తున్న 122 మంది వ్యక్తులను స్టడీ చేయడం ద్వారా ఈ విషయం వెల్లడైంది. 74.6 శాతం మంది మహిళలు సగటు బీఎంఐ (BMI) 39 కలిగి ఉన్నప్పుడు 18 నెలలపాటు వారిని పరిశోధకులు పరిశీలించారు. అయితే వీరిలో 18 నెలల వ్యవధిలో పొరుగు ప్రాంతాల ప్రభావంవల్ల నడుము చుట్టుకొలతల్లో, బరువులో మార్పుల మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. వారి పొరుగు(neighborhood) ప్రాంతంలోని వివిధ అంశాలను అంచనా వేసే ప్రశ్నావళిని పూర్తి చేశారు. ఐదు ప్రధాన అంశాలు నైబర్ హుడ్ సేఫ్టీ, ఆకర్షణ, సామాజిక సమన్వయం(social cohesion), కిరాణా దుకాణాలు, క్రీడా సౌకర్యాలు వంటివి అందుబాటులో ఉన్నవారిని, లేనివారిని కూడా పరిశీలించారు.
సేఫ్టీ ఆలోచన నేరం లేదా వేధింపుల భయాలను పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు కనుగొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నడక లేదా సైకిల్ తొక్కడం వంటి కంఫర్ట్ లెవల్స్‌ను కూడా అంచనా వేశారు. ఈ విధమైన కేటగిరీలో సాయంత్రాలు, రాత్రి వేళల్లో వీధి దీపాల యొక్క సమర్ధతను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆకర్షణీయమైన చెట్లు, పార్కుల ఉనికిని, అలాగే సాధారణ పరిశుభ్రతను అంచనా వేశారు. సామాజిక ఐక్యత అనేది నైబర్ హుడ్‌లో లోన్లీనెస్ భావాలను, నైబర్‌హుడ్ మధ్య ఇంటరాక్షన్ లెవల్‌ను, ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి వారి సుముఖతను పరిశీలించారు. అయితే పొరుగు ప్రాంతాలను సేఫ్టీగా ఫీలయ్యే వారిలో మొదటి 10 వారాల తర్వాత, వారి ప్రారంభ బరువుతో పోల్చితే 1.3 శాతం అధిక బరువు తగ్గినట్లు అధ్యయన కర్తలు గుర్తించారు. దీర్ఘకాలంలో అయితే భద్రతా భావం బరువులో సగటున 3.2 శాతం తగ్గుదలతోపాటు, నడుము చుట్టుకొలతలో సగటున 2.6 శాతం తగ్గింపుతో ముడిపడి ఉంది.
సేఫ్టీ ఎందుకు ముఖ్యం?
‘‘పొరుగు భద్రత (neighborhood safety) ఎందుకు ముఖ్యమైనది అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రజలు అసురక్షితంగా భావిస్తే బయటికి వెళ్లడానికి ఇష్టపడరు. ఫలితంగా వారికి తక్కువ శారీరక శ్రమ ఉంటుంది. అదే సేఫ్టీగా భావిస్తే బయటకు వెళ్తారు. వ్యాయామాలు చేస్తారు. వివిధ శారీరక శ్రమ పనులవైపు మొగ్గు చూపుతారు’’ అని రోటర్‌డ్యామ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన బోయెల్ బ్రౌవర్ (Boelle Brouwer ) పేర్కొన్నారు. మరొక వివరణ ఏంటంటే.. అభద్రతా భావాలు (feelings of insecurity ) స్ట్రెస్ లెవల్స్‌ను పెంచుతాయి. ఇది అన్ హెల్తీ ఈటింగ్ బిహేవియర్‌తో పాటు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి.
సామాజిక సమన్వయం-నైబర్‌హుడ్ ఎఫెక్ట్
సామాజిక సమన్వయం(Social cohesion) కలిగి ఉన్న వ్యక్తుల్లో ఒక-పాయింట్ బరువు పెరుగుదల మొదటి 10 వారాలలో నడుము చుట్టుకొలతలో సగటున 1.3 శాతం తగ్గుదలకు దారితీస్తుందని అధ్యయనం కనుగొంది. ఎందుకంటే సోషల్ సపోర్ట్ అటువంటి మోటివేషన్ అందించగలదని నిపుణులు చెప్తున్నారు. పరిసరాల్లోని వ్యక్తులతో కనెక్ట్ అవడం, సపోర్ట్ పొందడంవల్ల హెల్తీ బిహేవియర్స్‌కు కట్టుబడి ఉండటం, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ ఓవరాల్ ఔట్‌కమ్స్ మొత్తం ఫలితాలను మెరుగుపరుస్తుందని పరిశోధకుడు బ్రౌవర్ అంటున్నారు. అయితే సామాజిక సమన్వయంకంటే కూడా నైబర్ హుడ్ అట్రాక్టివ్‌నెస్ లాంగ్‌టర్మ్ బరువు తగ్గడం, నడుము చుట్టుకొలత మార్పుల మధ్య సమర్థవంతమైన సంబంధం కలిగి ఉంది. అందుకే మీరు నివసించే ప్రాంతం సురక్షితమైందని భావిస్తే మీరు బయటకు వెళ్తారు.కిరణా షాపులకు, జిమ్‌లకు, ఇతర చిన్న చిన్న పనులకు నడుచుకుంటూ వెళ్తారు. వాకింగ్, రన్నింగ్ చేస్తారు. దీనివల్ల శారీరక శ్రమ పెరిగి బరువు తగ్గుతారు. మీరు నివసించే ప్రాంతం అభద్రతతో కూడుకున్నది అయితే బయటకు వెళ్లేందుకు సమస్యగా భావిస్తారు. తరచుగా కాకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంటారు. ఎక్కువగా ఇంట్లో ఉండటంవల్ల ఈటింగ్ డిజార్డర్, మానసిక ఒత్తిడి వంటివి పెరిగి అధిక బరువు సమస్యకు దారితీయవచ్చు అంటున్నారు పరిశోధకులు.
ఇవి కూడా చదవండి:
బ్రెయిన్ క్యాన్సర్ రోగుల జీవిత కాలాన్ని పెంచే ‘పాత్ బ్రేకింగ్’ విధానాన్ని కనుగొన్న సైంటిస్టులు