చంద్రుడిపై చీకటి ప్రాంతాలకు AIతో వెలుగు

by Hamsa |   ( Updated:2022-09-02 10:46:09.0  )
చంద్రుడిపై చీకటి ప్రాంతాలకు AIతో వెలుగు
X

దిశ, ఫీచర్స్ : చంద్రుని ఉపరితలంపై గల చీకటి ప్రాంతాల పరిశీలనకు, భూమి-చంద్ర వ్యవస్థలో నీటి ఏకీకరణకు సంబంధించిన ఆధారాలను అర్థం చేసుకునేందుకు ETH జ్యూరిచ్ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి కొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ చీకటి ప్రాంతాల్లో ఏర్పడే మంచు వలన రాకెట్ ప్రొపెల్లెంట్ లేదా రేడియేషన్ నుంచి రక్షణ కోసం వ్యోమగాములకు ఉపయోగపడే వనరులను అందించవచ్చని అంచనా వేస్తున్నారు.

నిజానికి చంద్రునిపై చీకటి ఉందనేది ఒక అపోహ. ఎందుకంటే చంద్రుని భ్రమణం దాని భూమధ్యరేఖ చుట్టూ స్థిరమైన సూర్యకాంతిని పొందేలా చేస్తుంది. అయినప్పటికీ ఎత్తైన అక్షాంశాలు, ధ్రువ ప్రాంతాలు ఎటువంటి కాంతి కిరణాలను స్వీకరించవు. ఫలితంగా ఈ షేడెడ్ రీజియన్స్ ఎప్పుడూ 170° నుంచి 240° సెల్సియస్, సంపూర్ణంగా సున్నా సెల్సియస్‌కు చేరుకునే ఉష్ణోగ్రతలతో ప్లూటో ఉపరితలం కంటే కూడా చల్లగా ఉంటాయి. కాగా ఆర్టెమిస్ ఎక్స్‌ప్లోరేషన్ జోన్‌లోని 44 షేడెడ్ రీజియన్స్‌లో అధిక-సిగ్నల్, హై-రిజల్యూషన్ లూనార్ రెకనైసెన్స్ ఆర్బిటర్ యొక్క న్యారో-యాంగిల్ కెమెరా చిత్రాలను రూపొందించేందుకు శాస్త్రవేత్తలు భౌతిక-ఆధారిత డీప్ లెర్నింగ్ పోస్ట్-ప్రాసెసింగ్ టూల్ ఉపయోగించారు. ఇది బిలం గోడలు(crater walls), పర్వతాల పక్కనుండే చీకటి ప్రాంతాలకు కట్టుబడి ఉన్న ఫోటాన్స్‌ను సంగ్రహిస్తుంది.

లూనార్ అండ్ ప్లానెటరీ ఇన్‌స్టిట్యూట్(LPI) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ A. కింగ్ ప్రకారం.. ఇది శాశ్వతంగా నీడ కలిగిన ప్రాంతాల్లో వెలుగును ప్రసరింపజేసే మార్గాలను సృష్టించేందుకు అనుమతిస్తుంది. తద్వారా ఆర్టెమిస్ వ్యోమగాములు, రోబోటిక్ అన్వేషకులకు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నాసా ప్రకారం.. ఆర్టెమిస్ మిషన్ వ్యోమగాములు నావెల్ స్పేస్ సూట్స్ ధరించి షేడెడ్ రీజియన్స్‌లో రెండు గంటలు మాత్రమే గడపగలరు. కాబట్టి ఈ కొత్త చిత్రాలు మెరుగైన మిషన్ ప్లానింగ్‌లో సాయపడతాయి. చీకటి ప్రాంతాల్లోని రాతిప్రదేశాలకు వ్యోమగాములకు మార్గనిర్దేశం చేయడంతో పాటు అక్కడి మట్టిని సేకరించి, మంచు ఆనవాళ్ల కోసం విశ్లేషించవచ్చు.

Also Read: బ్రెయిన్, ఫ్యాట్ మాట్లాడుకుంటాయ్ : శాస్త్రవేత్తలు

Advertisement

Next Story