రోజూ లక్షల విలువైన బంగారాన్ని బయటకు కక్కే పర్వతం.. అక్కడికి వెళ్లడం అసాధ్యం..

by Sumithra |
రోజూ లక్షల విలువైన బంగారాన్ని బయటకు కక్కే పర్వతం.. అక్కడికి వెళ్లడం అసాధ్యం..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నో బంగారు గనులు ఉన్నాయి. ప్రతి రోజు ఆ గనుల నుంచి మిలియన్ల విలువైన బంగారం వెలికితీస్తారు. ఇందులో భారతదేశం, చైనాతో సహా అమెరికా నుంచి ఓషియానియా, ఆఫ్రికా, ఆసియా వరకు అనేక దేశాలు ఉన్నాయి. అయితే బంగారం భూమి లోతుల్లో దాగి ఉంటుంది. భూమి అడుగున చాలా విలువైన వస్తువులు ఉండొచ్చని, కానీ మనుషులు అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రోజు మనం అలాంటి ఒక ప్రదేశం గురించి మీకు చెప్పబోతున్నాము. అక్కడ ప్రతిరోజూ లక్షల విలువైన బంగారం 'పాతాల్ లోక్' నుండి బయటకు వస్తుంది, కానీ అక్కడికి చేరుకోవడం దాదాపు అసాధ్యం.

ఈ ప్రదేశం అంటార్కిటికాలో ఉంది. IFL సైన్స్ నివేదిక ప్రకారం అంటార్కిటికాలో మౌంట్ ఎరెబస్ అనే అగ్నిపర్వతం ఉంది. ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ బంగారు ధూళిని వెదజల్లుతుంది. ఈ గోల్డ్ డస్ట్ ధర 6 వేల డాలర్లు అంటే దాదాపు 5 లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇక్కడకు చేరుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అంటార్కిటికాలో ఉన్న 138 క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ ఎరెబస్ ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అగ్నిపర్వతం ప్రతిరోజూ దాదాపు 80 గ్రాముల స్ఫటికీకరించిన బంగారాన్ని కలిగి ఉన్న వాయువును వెదజల్లుతుంది. ఈ విలువైన ధూళి 12,448 అడుగుల ఎత్తులో ఎగురుతుంది.

ఈ అగ్నిపర్వతం కూడా రాళ్లను వెదజల్లుతుంది

అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం ఈ అగ్నిపర్వతం క్రమం తప్పకుండా వాయువు, ఆవిరిని విడుదల చేస్తుంది. కొన్నిసార్లు రాళ్లను కూడా చిమ్ముతుంది. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలోని లామోంట్-డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీకి చెందిన కానర్ బేకన్ లైవ్ సైన్స్‌తో మాట్లాడుతూ ఈ అగ్నిపర్వతం 1972 నుండి నిరంతరం విస్ఫోటనం చెందుతోంది. అయితే ఇది మిలియన్ల సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉందని చెబుతారు.

ఇక్కడికి వెళితే మృత్యువు నోటిలోకి వెళ్లినట్లే..

ఎరెబస్ పర్వతం 1841 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ పర్వతానికి కెప్టెన్ జేమ్స్ క్లార్క్ రాస్ తన ఓడ ఎరెబస్ పేరు పెట్టారు. అతను ఓ అన్వేషకుడు. ఆయన ఒకానొక సమయంలో అంటార్కిటిక్ యాత్రకు బయలుదేరాడు. ఇప్పటి వరకు చాలా మంది ఈ పర్వతాన్ని అధిరోహించినప్పటికీ, అగ్నిపర్వతం వరకు వెళ్ళలేదు, ఎందుకంటే అలా చేస్తే మృత్యువు నోటిలోకి వెళ్ళినట్లే.

Advertisement

Next Story