VIRAL : 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గిన వ్యక్తి...ఆరు నెలల్లోనే... అసలు ఎలా సాధ్యమైంది?

by Sujitha Rachapalli |
VIRAL : 610 కిలోల నుంచి 63 కిలోలకు తగ్గిన వ్యక్తి...ఆరు నెలల్లోనే... అసలు ఎలా సాధ్యమైంది?
X

దిశ, ఫీచర్స్: ఖలీద్ బిన్ మొహసేన్ షరీ.. ఒకప్పుడు అత్యంత బరువైన వ్యక్తిగా పాపులర్ అయ్యాడు. దాదాపు 610 కిలోల బరువుతో లేచి కూర్చోలేని పరిస్థితుల్లో ఉండేవాడు.సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా జోక్యంతో 542 కిలోగ్రాముల బరువు కోల్పోయిన ఆయన.. అమేజింగ్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ కు ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు. అధిక బరువుతో దాదాపు మూడేళ్లు మంచానికే పరిమితమైన ఆయన.. బరువు తగ్గి నవ్వులు చిందిస్తుండటం ఎలా సాధ్యమైంది? ఎలాంటి వైద్యం అందించారు? తెలుసుకుందాం.

2013లో షరీ పరిస్థితి కింగ్ అబ్దుల్లా దృష్టిని ఆకర్షించింది, సమగ్ర వైద్య ప్రణాళికను అందించేందుకు కారణమైంది. ఇందుకోసం 30 మంది వైద్య నిపుణుల బృందం పనిచేసింది. ఫోర్క్‌లిఫ్ట్, ప్రత్యేకంగా రూపొందించిన బెడ్‌ని ఉపయోగించి.. పూర్తి చికిత్స కోసం జజాన్‌లోని షరీని అతని ఇంటి నుంచి రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు. అతని ట్రీట్మెంట్ ప్లాన్ లో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, తగిన ఆహారం, కఠినమైన వ్యాయామ నియమావళి ఉన్నాయి. మొదటి ఆరు నెలల్లో ఇంటెన్సివ్ కేర్, ఫిజియోథెరపీ తన శరీర బరువులో దాదాపు సగం తగ్గడానికి సహాయపడింది. 2023 నాటికి 63.5 కిలోగ్రాములకు తగ్గింది. అయితే పెద్ద మొత్తంలో బరువు తగ్గడం వల్ల.. అదనపు చర్మాన్ని తొలగించడానికి అనేక శస్త్రచికిత్సలు అవసరం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed