- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషిని చూసి భయపడిన సింహం..ఏంటీ విధి వైపరిత్యం..?! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః సింహాన్ని జూ పార్క్‌లో దూరంగా చూస్తేనే జరంత భయం అయితది. అలాంటిది, చేతిలో ఓ చిన్న కర్రపుల్లతో ఏకంగా దాని ముందుకెళ్లి, ఏదో కుక్కను తరుముతున్నట్లు సింహాన్ని అదిలిస్తే.. అది ఊహించడానికే వెన్నులో వణుకు పుట్టుద్ది. కానీ, ఓ వ్యక్తి నిజంగా భారీ సింహాన్ని కర్రతో బెదరగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ప్రాణం పోతుందనుకున్న టైమ్‌లో తప్పించుకోడానికి కూడా మార్గం లేనప్పుడు తెగింపే కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. బహుశా, అలాంటి ధైర్యమే ఈ వ్యక్తిలోనూ వచ్చిందేమో..?! ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'యానిమల్స్_పవర్స్' అనే పేజీలో షేర్ చేశారు. "మనిషికి భయపడిన సింహం" అనే ట్యాగ్‌తో వచ్చిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూవ్స్ రాగా, నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందించారు.
మనిషిని చూసి భయపడుతున్న సింహాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండగా, మరికొందరు కర్రపట్టుకొని 'మూగ జీవాన్ని' అదిలిస్తున్నందుకు ఆ వ్యక్తిని విమర్శించారు. "ఆ సింహాన్ని దాని పాటికి దాన్ని వదిలేయొచ్చుగా, అదేం నేరం చేసింది" అని మరొకరు అన్నారు. అయితే, ఆ వ్యక్తి తప్పనిసరిగా సింహానికి శిక్షణ ఇస్తున్నాడని కొందరు నెటిజన్లు సూచించారు. అసలు జరిగిందేంటో తేలియదు గానీ, ఇంటర్నెట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. సింహాన్ని చూసి మనుషులు బయపడటం తెలుసు గానీ, ఒక్క మనిషిని చూసి సింహం భయపడటం అరుదైన విషయమేగా మరి!