- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
43 ఏళ్లలో 53 పెళ్లిళ్లు.. పండగ చేసుకుంటున్న వ్యక్తి
దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పురుషులు ఒక్క పెళ్లితోనే పుట్టెడు కష్టాలు అనుభవిస్తుంటే.. ఇక్కడో ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 53 సార్లు వివాహమాడి వార్తల్లో నిలిచాడు. అయితే శృంగార సుఖం, వ్యక్తిగత ఆనందం కోసమే ఇంతమందిని మ్యారేజ్ చేసుకున్నాడా? అంటే కాదు. కేవలం స్థిరత్వం, మనశ్శాంతి కోసమే ఇన్నిసార్లు వివాహం చేసుకున్నట్లు సౌదీకి చెందిన అబూ అబ్దుల్లా(63) వెల్లడించాడు. ఈ మేరకు 'శతాబ్దపు బహుభార్యత్వవేత్త'గా పేరు పొందాడు.
43 సంవత్సరాల్లో 53 మంది మహిళలను వివాహమాడిన అబ్దుల్లాకు 20 ఏళ్ల వయసులోనే తన కంటే ఆరేళ్లు పెద్దదైన మహిళతో మొదటి వివాహం జరిగింది. ఇక తన సంసారం పిల్లాపాపలతో సాఫీగా సాగడంతో మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలగలేదని చెప్పాడు అబ్దుల్లా. కానీ కొన్నేళ్ల తర్వాత ఆలుమగల బంధంలో సమస్యలు తలెత్తడంతో 23 ఏళ్ల వయసులో రెండో వివాహానికి సిద్ధమై తన నిర్ణయాన్ని మొదటి భార్యకు తెలియజేశాడు. ఆ తర్వాత మొదటి, రెండో భార్యకు మధ్య గొడవలు రావడంతో అబ్దుల్లా మూడు, నాల్గవసారి మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత తన మొదటి భార్యలు ఇద్దరికి విడాకులు ఇచ్చాడు.
అబ్దుల్లా పెళ్లిళ్ల పరంపర ఈ విధంగా కొనసాగగా.. తనను సంతోషపెట్టగల స్త్రీ కోసం వెతికే క్రమంలో ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు తన భార్యలందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఇక ఈ పెళ్లిళ్ల ప్రయాణంలో.. అతి చిన్న వివాహం కేవలం ఒక్క రాత్రే కొనసాగిందని 63 ఏళ్ల అబ్దుల్లా వెల్లడించాడు. అతను ఎక్కువగా సౌదీ మహిళలనే వివాహం చేసుకోగా.. ఓవర్‌సీస్ బిజినెస్ ట్రిప్స్ సందర్భంగా విదేశీ మహిళలను పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించాడు.
'నేను వ్యాపార పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లినపుడు మూడు నాలుగు నెలలు ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల నుంచి నన్ను రక్షించుకునేందుకు వివాహం చేసుకున్నాను. నిజానికి ప్రపంచంలోని ప్రతి పురుషుడు ఒక స్త్రీతో కలకాలం జీవించాలని కోరుకుంటాడు. అయితే స్థిరత్వం అనేది యువతితో కాదు వృద్ధురాలితో' అని ముగించిన అబ్దుల్లా.. ప్రస్తుతానికైతే మరో పెళ్లి ఆలోచనలో లేదని స్పష్టం చేశాడు.