విషాన్ని సేవించిన వ్యక్తి.. ‘‘పున్నమి నాగు’’ స్టోరీ రిపీట్.. కానీ వందకుపైగా పాములు పగబట్టి..

by Sujitha Rachapalli |   ( Updated:2025-03-17 14:04:59.0  )
విషాన్ని సేవించిన వ్యక్తి.. ‘‘పున్నమి నాగు’’ స్టోరీ రిపీట్.. కానీ వందకుపైగా పాములు పగబట్టి..
X

దిశ, ఫీచర్స్ : మెగాస్టార్ చిరంజీవి ‘‘పున్నమి నాగు’’ స్టోరీ గుర్తుందా? ఇందులో మన హీరోకు చిన్నప్పటి నుంచే విషం తీసుకోవడం అలవాటు చేయడం వల్ల పున్నమి రాత్రి వింతగా మారిపోతాడు. యువతులపై దాడి చేస్తాడు. అతనికి పాము కుట్టినా కూడా శరీరంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపదు. అచ్చం ఇలాంటి సీన్ రియల్ లైఫ్‌లోనూ రిపీట్ అయింది. కానీ తానే స్వయంగా ఈ పని చేసుకోవడం విశేషం. కాగా ఈ స్పెషల్ పర్సన్ ఎవరు? ఏం చేశాడు? ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? చూద్దాం.

బిల్ హాస్ట్ అనే వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పాము విషాన్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు. తొలుత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా.. ఆ తర్వాతి సంవత్సరాల్లో అతని శరీరం ఈ విషానికి అలవాటు పడిపోయింది. ఇమ్యూనిటీ పవర్ పెరగడంతోపాటు దాదాపు 172కుపైగా పాములు కరిచినా బతికాడు. పాము కాటుకు గురైన వ్యక్తులకు తన రక్తాన్ని ఇచ్చి ప్రాణదానం చేశాడు. ముఖ్యంగా ఇలా పాము విషానికి అలవాటు పడిన వ్యక్తి వందేళ్లు బతకడం నిజంగా ఆశ్చర్యకరమే.

Read More..

Air conditioner : వేసవిలో ఏసీలు కూడా పేలొచ్చు..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

Next Story