లో ప్రోటీన్ డైట్‌తో క్యాన్సర్ కణాలు మటాష్.. కొత్త అధ్యయనం

by sudharani |   ( Updated:2022-12-11 13:45:30.0  )
లో ప్రోటీన్ డైట్‌తో క్యాన్సర్ కణాలు మటాష్.. కొత్త అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : రెగ్యులర్ డైట్‌ను మార్చుకోవడం అనేది పెద్దప్రేగు క్యాన్సర్‌ను తగ్గించడంలో సాయపడుతుందని కొత్త అధ్యయనం వెల్లడించింది. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ రోజెల్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం.. మానవ కణాల మాదిరిగానే క్యాన్సర్ కణాల పెరుగుదలకు పోషకాలు అవసరమని తెలిపింది. ఒక కణంలోని అత్యంత కీలకమైన న్యూట్రియంట్-సెన్సింగ్ అణువును mTORC1 అని పిలుస్తారు. ఇది కణాల పెరుగుదలలో ప్రధాన నియంత్రకంగా పరిగణించబడుతున్నందున.. ఇది వివిధ పోషకాలను గ్రహించడంలో కణాలను అనుమతించడంతో పాటు వాటి పెరుగుదలకు, విస్తరించేందుకు తోడ్పడుతుంది.

పోషకాలు సరిపోనప్పుడు, కణాలు పోషకాల కోసం వెతుకుతున్న తీవ్రతను తగ్గించడం సహా mTORC1ని ఆపివేస్తాయి. ఇక పెద్దప్రేగు క్యాన్సర్‌లో mTORC1 హైపర్‌యాక్టివ్‌గా పరిగణించబడుతున్నప్పటికీ, పెద్దప్రేగు కణితులు mTORC1 ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లడానికి న్యూట్రియంట్-సెన్సింగ్ మార్గాలపై నియంత్రణను తీసుకుంటాయా అనేది ఇక్కడ అతిపెద్ద ఆందోళనగా భావించబడుతోంది. ఈ పరిశోధనకు సంబంధించి మిచిగాన్ మెడిసిన్‌ వద్ద ఫిజియాలజీ ప్రొఫెసర్.. పెద్దప్రేగు క్యాన్సర్ విషయంలో, కణాలు తగినంత పోషకాలు అందుబాటులో లేవని కనుగొన్నపుడు, అవి ఏం చేయాలో తెలియని సంక్షోభ స్థితికి వెళ్తాయని వివరించారు. ఫలితంగా భారీగా కణాల మరణానికి దారితీస్తుందని చెప్పారు.

క్యాన్సర్ పెరుగుదలకు కారణమైన మాస్టర్ రెగ్యులేటర్ (mTORC1)ను ప్రారంభించిన న్యూట్రియంట్ సిగ్నలింగ్ మార్గాన్ని తక్కువ-ప్రోటీన్ ఆహారం నిరోధించిందని పరిశోధకులు కణాలు, ఎలుకల్లో కనుగొన్నారు. కణాలు పెరగడానికి, రెట్టింపు కావడానికి పోషక సంకేతాలను ఎలా ఉపయోగించాలో mTORC1 నియంత్రిస్తుంది. ఇది కొన్ని ఉత్పరివర్తనలతో క్యాన్సర్లలో చాలా చురుగ్గా ఉన్నట్లు కనిపించడమే కాక ప్రామాణిక చికిత్సలకు కూడా నిరోధకతను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పరిశోధకులు.. GATORను పోలిన కాంప్లెక్స్ ద్వారా తక్కువ-ప్రోటీన్ ఫుడ్‌కు మారడం, రెండు కీలకమైన అమైనో ఆమ్లాల్లో నిర్దిష్ట తగ్గింపు ద్వారా పోషక సంకేతాలను మార్చగలిగారు.

mTORC1ని యాక్టివ్‌గా ఉంచేందుకు GATOR1, GATOR2 కలిసి పనిచేశాయి. సెల్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పుడు, GATOR2.. mTORC1ను యాక్టివేట్ చేసింది. పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు, GATOR1.. mTORC1ను డీయాక్టివేట్ చేసింది. అదనంగా, కొన్ని రకాల అమైనో ఆమ్లాలను పరిమితం చేయడం పోషక సంకేతాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇన్‌హిబిటర్ల సాయంతో mTORCను నిరోధించే ప్రయత్నాలు గతంలో జరిగాయి. కానీ అవి తీవ్ర దుష్ప్రభావాలను కలిగి ఉన్నాయి. రోగులు వాటిని తీసుకోవడం ఆపివేసినప్పుడు క్యాన్సర్ తిరిగి పుంజుకుంటుంది. తక్కువ-ప్రోటీన్ ఆహారం ద్వారా అమైనో ఆమ్లాలను పరిమితం చేయడం ద్వారా వాటి మార్గాన్ని నిరోధించే కొత్త పద్ధతి.. mTORCను షట్ ‌డౌన్ చేసేందుకు ఆల్టర్నేటివ్ మార్గాన్ని అందిస్తుంది.

ఇదే విషయమై అధ్యయన రచయిత సుమీత్ సోలంకి ఇలా వివరించారు. 'mTORC నియంత్రణలో పోషకాలు ముఖ్యమైనవని మాకు తెలుసు. కానీ అవి నేరుగా mTORCకి ఎలా సంకేతాలిస్తాయో తెలియదు. న్యూట్రియంట్ సిగ్నలింగ్ మార్గం.. ఆంకోజెనిక్ సిగ్నలింగ్ మార్గం వలె mTORCని నియంత్రించడం చాలా ముఖ్యమైనదని మేము కనుగొన్నాం' అని తెలిపారు. అయితే క్యాన్సర్ రోగులకు దీర్ఘకాలికంగా ప్రొటీన్-లోపం ఉన్న ఆహారం అందించడం అనువైనది కాదు. కానీ కీమోథెరపీ లేదా రేడియేషన్ ప్రారంభించడం వంటి కీ విండోస్ కనుగొనగలిగితే.. రోగులు తక్కువ ప్రోటీన్ డైట్‌ను తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు ఒకటి లేదా రెండు వారాలు ఆ చికిత్సల సామర్థ్యాన్ని పెంచగలమని వివరించారు.


Advertisement

Next Story

Most Viewed