- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ పందికొక్కు చేసిన వరల్డ్ రికార్డ్ చూస్తే మైండ్ బ్లాకే..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః పేరులో ఏముంది చేసిన పనిలో గొప్పతనం చూడాలి కానీ.. అలాగని దీనిపేరు పంది కూడా కాదు. అసలు, గినియా పంది ఎలుకల జాతికి చెందింది. పందుల్ని పెంచుకున్నట్లు వీటిని కూడా పెంచుకొని, కోసుకు తింటారు కాబట్టి పందిగా.. అదే, గినియా పందిగా, అంటే పందికొక్కుగా పిలుచుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే, ఒక పందికొక్కు వరల్డ్ రికార్డ్ సాధించడం మాత్రం గొప్పగానే చెప్పుకోవాలి. 30 సెకన్లలో అత్యధిక బాస్కెట్‌బాల్ స్లామ్ డంక్స్‌ను సాధించడంతో మోలీ అనే ఈ పందికొక్కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. ప్రపంచ రికార్డును సృష్టించి, ఔరా అనిపించింది. తన యజమాని ఎమ్మా ముల్లర్‌తో కలిసి మోలీ హంగరీలోని డోంబోవర్‌లో నివసిస్తుంది. రికార్డు సందర్భంగా ఎమ్మా ముల్లర్ గిన్నిస్‌తో మాట్లాడుతూ, మోలీకి క్రీడలు, ఇతర కార్యకలాపాల పట్ల విపరీతమైన అభిరుచి ఉందని, "మోలీకి బాస్కెట్‌బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం" అని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోలీ వరల్డ్ రికార్డ్ ఫీట్ వీడియో పోస్ట్ చేశారు. గిన్నీస్ కూడా మోలీ టాలెంట్‌ను మెచ్చుకుంటూ వీడియోను షేర్ చేశారు.