- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంచి కథకుడు మనసు దోచేస్తాడా?..శృంగార భాగస్వాములను ఆకర్షించడంలో కీ రోల్
దిశ, ఫీచర్స్:ఆసక్తి కలిగించే మంచి కథను అందరూ ఇష్టపడతారు. కానీ, అదే కథ ప్రేమలో పడేస్తుందా? అంటే ఏమో చెప్పలేం. నిజానికి స్టోరీటెల్లింగ్ అనేది కమ్యూనికేషన్‌కు ప్రాథమిక రూపం. కాబట్టే మనసులను మార్చడం, ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కథనాలకు శక్తి ఉందని సంబంధిత పరిశోధన వెల్లడించింది. ఉదాహరణకు, వ్యక్తిగత కథనాలు తరచుగా ప్రకటనలు, హెల్త్ క్యాంపెయిన్స్‌లో ఉపయోగించబడతాయి. ఇవి క్యాన్సర్ స్క్రీనింగ్స్ పెరుగుదలకు దారితీశాయి. అలాగే నవలలు కూడా సామాజిక మార్పునకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక శృంగార భాగస్వాములను ఆకర్షించడంలో కథ చెప్పే సామర్థ్యం ప్రయోజనకరంగా ఉందో లేదో తెలుసుకునేందుకు మూడు అధ్యయనాలు నిర్వహించిన సైకాలజిస్టులు.. ప్రత్యేకించి ఒక జెండర్‌కు మంచి కథ చెప్పగలగడం వారిని ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.
సమూహాన్ని కమాండ్ చేయడం :
మొదటి అధ్యయనంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్లను అపోజిట్ జెండర్‌కు చెందిన వ్యక్తి చిత్రాన్ని చూడటం ద్వారా సంభావ్య శృంగార భాగస్వామిని అంచనా వేయమని అడిగారు. ఈ సందర్భంగా వారు సదరు వ్యక్తి స్వస్థలం, సంక్షిప్త & న్యూట్రల్ బయోగ్రాఫికల్ ఇన్‌ఫర్మేషన్‌తో పాటుగా ఆ వ్యక్తి కథ చెప్పే సామర్థ్యం గురించి కూడా సమాచారాన్ని అందుకున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో నాలుగు సమూహాలు ఉన్నాయి. చిత్రంలో ఉన్న వ్యక్తి మంచి కథకుడు, మితమైన కథకుడు లేదా నాసిరకం కథకుడు అని పాల్గొనేవారికి చెప్పబడింది. (నియంత్రణ స్థితిలో ఉన్న వారికి కథ చెప్పే సామర్థ్యం గురించి సమాచారం ఇవ్వలేదు.)
ఉదాహరణకు : గుడ్ స్టోరీ టెల్లింగ్ కండిషన్‌లో ఉన్న వ్యక్తి గురించి 'ఆసక్తికరమైన పదాల పొందికతో తరచుగా పార్టీల్లో మంచి కథలు చెబుతారు' అని పార్టిసిపెంట్స్ చదువుతారు. ఈ వర్ణనలు చదివిన తర్వాత అందరూ సదరు వ్యక్తి శారీరక ఆకర్షణతో పాటు డేటింగ్, లాంగ్ టర్మ్ రిలేషన్, ఫ్రెండ్‌గా తమను ఎంతలా ఆకర్షించాడో రేటింగ్ ఇచ్చారు. ఆశ్చర్యకరంగా, మొదటి అధ్యయనం నుంచి వచ్చిన ఫలితాలు స్టోరీ టెల్లింగ్ స్కిల్ పట్ల అంతగా ఆకర్షణ పెంచలేదు. కానీ సమర్థవంతమైన కథకులుగా ఉన్న పురుషులు దీర్ఘకాలిక సహచరులను ఆకర్షించడంలో ప్రయోజనాన్ని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి విరుద్ధంగా, కథలు బాగా చెప్పే మహిళగా వర్ణించబడిన స్త్రీ పురుషులకు అంతగా నచ్చలేదు. అలాగే మంచి కథలు చెప్పిన వ్యక్తి షార్ట్ టర్మ్ రిలేషన్‌కు అంతగా ఇష్టపడలేదు.
ఇక రెండో అధ్యయనంలో.. పార్టిసిపెంట్స్‌కు సంభావ్య(Potential) సహచరుడు చెప్పిన వాస్తవ కథనం అందించబడింది. సగం మంది పార్టిసిపెంట్స్ సమర్థవంతంగా చెప్పబడిన కథనాన్ని చదివారు. మిగిలిన సగం మంది అసమర్థంగా చెప్పబడిన కథనాన్ని అందుకున్నారు. మంచి కథతో పోలిస్తే.. నాసిరకం కథలో అనూహ్యమైన పదజాలం, అసంబద్ధమైన వివరాలు ఉపయోగించారు. అయితే ఇక్కడ కూడా అదే విధమైన ఫలితాలు వెలువడ్డాయి: స్త్రీలు మంచి మేల్ స్టోరీ టెల్లర్స్‌ను దీర్ఘకాల భాగస్వామిగా, నాసిరకం కథకుల కంటే ఎక్కువ ఆకర్షణీయంగా రేట్ చేశారు. అదే ఉమెన్ స్టోరీ టెల్లర్ చెప్పిన కథ మంచిదా లేదా నాసిరకమా? అనేది పురుషులు పట్టించుకోలేదు.
అయితే ఈ లింగ భేదం ఎందుకుందో అర్థం చేసుకునేందుకు పరిశోధకులు మొదటి అధ్యయనానికి సమానమైన మూడో అధ్యయనాన్ని నిర్వహించారు. అదనంగా సామాజిక స్థితికి సంబంధించిన ప్రశ్నలు జతచేశారు. 'ఈ వ్యక్తి ఎంతవరకు జనాదరణ పొందుతాడు? మెచ్చుకో బడతాడు? మంచి నాయకుడిగా ఉంటాడు? ఇతరులకు ప్రేరణగా ఉంటాడు?' అని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించారు. మళ్లీ ఇది పొటెన్షియల్ లాంగ్ టర్మ్ డేటింగ్ పార్ట్‌నర్ విషయానికొస్తే.. మహిళలు నాసిరకం కథకుల కంటే మంచి కథకులను మరింత ఆకర్షణీయంగా కనుగొన్నారు. మేల్ పార్టిసిపెంట్స్‌పై కథ చెప్పే సామర్థ్యం ప్రభావం చూపలేదు. ముఖ్యంగా స్త్రీలు, మంచి కథకులుగా ఉన్న పురుషులను ఉన్నత స్థితిలో అంటే.. నాయకులుగా లేదా ఆరాధించే వ్యక్తులుగా అనుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
పరిణామ వివరణలు :
ఈ ఫలితాలకు సంబంధించిన లింగ భేదాలను పార్ట్‌నర్ ఎంపికను అర్థం చేసుకోవడానికి పరిణామ విధానాల వెలుగులో అన్వయించుకోవచ్చు. ఈ రంగంలోని సిద్ధాంతాలు స్త్రీ పురుషుల జన్యువులను పంపడం కోసం వివిధ పరిణామ ఆందోళనలను హైలైట్ చేశాయి. పునరుత్పత్తి విషయానికొస్తే, సిద్ధాంతం ప్రకారం.. పురుషులు 'విస్తృతంగా పెట్టుబడి పెట్టడానికి' ఎక్కువగా సిద్ధమవుతారు. అయితే మహిళలు మాత్రం 'తెలివిగా పెట్టుబడి పెట్టడానికి' అవకాశం ఉంది. ప్రత్యేకించి పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా పురుషుల పెట్టుబడి చాలా తక్కువ(ఒకే ఒక లైంగిక చర్య). అదే మహిళలు మాత్రం నెలల పాటు గర్భం మోయడంతో పాటు శిశువుకు పాలిచ్చే అవకాశం ఉంటుంది. ఈ నమ్మకం ప్రకారం.. వయసు, శారీరక ఆకర్షణ వంటి సంతానోత్పత్తి సూచనలపై దృష్టిసారిస్తూ స్త్రీల కంటే పురుషులు స్వల్పకాలిక సంభోగం లేదా సంబంధాలకు ఎక్కువ కృషి చేయొచ్చు. అదే సమయంలో సంతానానికి వనరులను అందించగల సహచరుడిని గుర్తించేందుకు మహిళలు ప్రయత్నిస్తారు.
దీర్ఘకాలిక సంబంధాల్లో మహిళలు 'మంచి తండ్రి' లేదా ప్రొవైడర్‌కు ఎక్కువ విలువనిచ్చే అవకాశం ఉన్నందున, మేల్స్‌లో స్టోరీ టెల్లింగ్ సామర్థ్యం.. ప్రత్యేకించి మంచి కథకులు ఉన్నతమైన సామాజిక హోదాను పొందగలిగితే, మహిళలకు వనరులను పొందే నైపుణ్యాన్ని సూచించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. మంచి కథకులు నిజానికి ఉన్నత సామాజిక హోదా లేదా నాయకత్వ స్థానాలను పొందగలరా లేదా అని పరిశోధకులు ఇంకా పరీక్షించలేదు. కనీసం మూడో అధ్యయనం ఆధారంగా - ఆకట్టుకునే కథనంతో ప్రేక్షకులను కమాండ్ చేయగల ఎవరైనా సమూహంలో ఉన్నత స్థితిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇవి కూడా చదవండి