చెవిపై ముద్దు పెడుతూ.. ఐస్ క్రీమ్‌లా జుర్రేసిన బాయ్‌ ఫ్రెండ్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

by Hamsa |
చెవిపై ముద్దు పెడుతూ.. ఐస్ క్రీమ్‌లా జుర్రేసిన బాయ్‌ ఫ్రెండ్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, ఫీచర్స్: రొమాన్స్ అన్నాక కిస్ చేసుకోవడం సహజం.. ఎంత ఉద్వేగభరిత సందర్భమైనా ముద్దూ మురిపాలు సరదాగానే ఉంటాయి. కానీ ఓ చైనీస్ యువతి విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. దీంతో ఆమె చెవిపోటుతో బాధపడుతూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని హుయిజౌ సిటీకి చెందిన ఒక యువతిని తన బాయ్ ఫ్రెండ్ ఆమె ఎడమ చెవిపై ముద్దు పెడుతూ, చెవిని ఐస్ క్రీమ్‌లా జుర్రేయడమేగాక మొత్తం నోట్లోకి లాగి గట్టిగా పీల్చేశాడట. దీంతో అతని నోటి ద్వారా చెవి రంద్రంలోకి ప్రవేశించిన గాలి ఒత్తిడితో కర్ణభేరికి చిల్లు పడటంతో నొప్పి, వినికిడి లోపం, చెవిపోటు సమస్య మొదలైంది. దీంతో ఆమె హుయిజౌ ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్‌లోని ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించింది. చెవిపోటు గురించి వివరించింది కానీ డాక్టర్‌కు అసలు విషయం మాత్రం చెప్పలేదు.

అయితే ఆమె చెవిని పరీక్షిస్తున్న క్రమంలో చెవిపై ఆరిపోయిన రక్తపు మరకను గమనించిన డాక్టర్ ఏం జరిగిందో చెప్తే ట్రీట్‌మెంట్ అందించడం సులువవుతుందని చాలాసేపు రిక్వెస్ట్ చేయగా అసలు విషయం చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ కిస్ పెట్టే క్రమంలో జరిగిందంతా తెలిపింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తపై నెటిజన్లు ఆమె బాధ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు కానీ.. వెటకారంగా కామెంట్స్ మాత్రం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed