- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి 6 మార్గాలు
దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో మహిళలలో రొమ్ము క్యాన్సర్ గననీయంగా పెరుగుతూ అతి ప్రమాద స్థాయికి చేరుకుంటుంది. ఓ నివేదిక ప్రకారం భారత్ లో పది మంది మహిళలో ఒకరు ఈ రోమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలు ప్రతి స్త్రీని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తున్నాయి. అసలు ఈ రోమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది. దానిని నివారించే చర్యలు ఏమిటో తెలియక చాలా మంది మహిళలు సతమతమవుతుంటారు.
అయితే డాక్టర్ శుభమ్ గార్గ్ – సీనియర్ కన్సల్టెంట్, సర్జికల్ ఆంకాలజీ గారు ఇలా అన్నారు. మహిళలలో ఈ క్యాన్సర్ కు గల కారణం ఇది అని ప్రత్యేక కారణం చెప్పలేమని.. అలా అని ఈ క్యాన్సర్ ప్రమాదం నుంచి తగ్గించలేనిది కాదని.. కొన్ని మార్గాలను అనుసరించడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని ఆమె అన్నారు.
రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి 6 మార్గాలు
1. ఊబకాయం ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అందువల్ల బరువు అదుపులో ఉంచుకోవాలి.
2. మహిళలు తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు సమతుల్యంగా ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం ఉండకూడదు. అలాగే అధిక ఉప్పు, చక్కెర కంటెంట్‌ను తీసుకోకుడదు. పండ్లు రోజువారీగా తీసుకోవాలి.
3. మీరు మీ రోజువారీ షెడ్యూల్‌లో కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. అంటే రోజూ జిమ్‌కి వెళ్లాలని కాదు. లిఫ్ట్‌ను నివారించి మెట్లు ఎక్కడం. అలాగే మార్కెట్‌కు వెళ్లేటప్పుడు నడుచుకుంటు వెళ్లడం. అలాగే మరికొన్ని వ్యాయామం రోజూ చేస్తూ ఉండటం.
4. 30 ఏళ్ల తర్వాత ప్రసవం రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వీలైతే, మీరు 30 ఏళ్లలోపు కనీసం ఒక గర్భాన్ని కలిగి ఉండటం మంచిది.
4. తల్లిపాలు రొమ్ము క్యాన్సర్‌కు రక్షణగా ఉన్నట్లు కనుగొనబడింది. కాబట్టి ప్రతి మహిళ తన సంతానానికి కచ్చితంగా పాలు పట్టాలి. అలా చేయకపోతే రోమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ.
5. శారీరక హార్మోన్లను ఎక్కువగా కలపడం కూడా రొమ్ము క్యాన్సర్‌కు దారితీయవచ్చు. వంధ్యత్వానికి చికిత్స, అండాశయ ఉద్దీపన, పోస్ట్ మెనోపాజ్ హార్మోన్ల పునరావాసం వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని విషయాలు.
గుర్తుంచుకోండి, మీరు ఎల్లప్పుడూ రొమ్ము క్యాన్సర్‌ను నివారించలేకపోవచ్చు కానీ.. ఖచ్చితంగా ముందుగా గుర్తించవచ్చు. 45 సంవత్సరాల వయస్సు తర్వాత స్వీయ-రొమ్ము పరీక్ష, వార్షిక మామోగ్రామ్‌లు మీరు ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్‌లను గుర్తించడానికి కొన్ని మార్గాలుగా చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి : పరిపూర్ణ మత్స్యేంద్రాసన ప్రయోజనాలేంటి?