మట్టి కుండలలో వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 4 చిట్కాలు

by Anjali |   ( Updated:2025-03-16 05:23:43.0  )
మట్టి కుండలలో వంట చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 4 చిట్కాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మట్టి కుండలలో వంట చేయడం అనేది ఒక పురాతన పద్ధతి. ఆహారాన్ని వండడానికి మట్టి కుండలను ఉపయోగించడం నిజానికి సురక్షితమైన మార్గం. మట్టి కుండలు రంధ్రాలు కలిగి ఉంటాయి, ఇది ఆహారాన్ని నెమ్మదిగా ఉడికిస్తుంది. ఫలితంగా మంచి రుచి, పోషక నిలుపుదల లభిస్తుంది. అలాగే మట్టి కుండలలో వంట చేయడానికి అధిక నూనె అవసరం ఉండదు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనం లభిస్తుంది. మట్టి కుండలలో ఎటువంటి హానికరమైన రసాయనాలు లేదా విషపదార్థాలు ఉండవు. మరీ మట్టి కుండలలో ఆహారాన్ని వండేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఐదు చిట్కాలు చూద్దాం..

కుండను నానబెట్టడం..

వంట చేసే ముందు కుండను కొన్ని గంటలు నీటిలో నానబెట్టండి. మట్టి కుండలు రంధ్రాలు కలిగి ఉంటాయి కాబట్టి అవి తేమను నిలుపుకుంటాయి, ఇది వాటిని పగుళ్లు రాకుండా చేస్తుంది. కుండను నానబెట్టిన తర్వాత దానిని ఒక గుడ్డతో శుభ్రంగా తుడవండి. ఇప్పుడు దానిని నీటితో నింపి తక్కువ మంట మీద ఉంచండి. రెండు నిమిషాల తర్వాత నీటిని పారపోయండి.

తక్కువ వేడి మీద వంట చేయడం..

మన సాధారణ వంటగది కుండల మాదిరిగా కాకుండా మట్టి కుండల్ని అధిక వేడితో వంట చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కాగా ఎప్పుడూ కూడా మంట తక్కువ మీడియంలో ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా తక్కువ వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం నెమ్మదిగా ఉడికిపోతుంది. అప్పుడు ఆహారం రుచిగా మారుతుంది.

చెక్క లేదా సిలికాన్ గరిటె వాడటం..

మట్టి కుండలోని ఆహారాన్ని కలపడానికి లోహ గరిటెను ఉపయోగించడం వల్ల దాని లోపలి భాగం దెబ్బతింటుంది. కాగా బంకమట్టి కుండల కోసం, చెక్క, సిలికాన్ గరిటె ఉత్తమ ఎంపికలు. అవి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.

కుండ శుభ్రపరచడం

మట్టి కుండను సబ్బు, సున్నితమైన స్క్రబ్బర్ ఉపయోగించి సున్నితంగా శుభ్రం చేయండి. దానిని కడగేటప్పుడు జాగ్రత్తగా వహించండి. ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే కుండ సెకన్లలోనే విరిగిపోతుంది. శుభ్రం చేసిన తర్వాత దానిని కాటన్ వస్త్రంతో తుడవండి. మట్టి కుండను గాలిలో ఆరబెట్టండి లేదా సూర్యకాంతిలో ఉంచడం మేలు. మట్టి కుండను సూర్యకాంతిలో ఆరబెట్టడం దాని నుండి తేమను తొలగించడానికి ఉత్తమ మార్గం. మట్టి కుండను కాటన్ వస్త్రంలో చుట్టి నిల్వ చేయండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More : మార్నింగ్ వేళ ఫ్రూట్స్ జ్యూస్, డీటాక్స్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా..?

Next Story

Most Viewed