- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫాస్ట్ లెర్నింగ్‌కు మూడు చిట్కాలు
దిశ, ఫీచర్స్ : మనలో చాలామంది ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్‌ను దీర్ఘకాలం గుర్తుంచుకునేందుకు లేదా ఏకాగ్రతతో కొత్త పద్ధతులను వేగంగా నేర్చుకోవడంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం తెలిసిందే. ఎంత ప్రయత్నించినా సదరు విషయాలపై పట్టు సాధించలేక నిరాశకు గురవుతుంటాం. ఈ సమస్యలకు మూడు ట్రిక్స్‌తో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
* స్లీప్ శాండ్‌విచ్
ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ సిద్ధం చేసేందుకు ఒక రోజు మాత్రమే ఉంటే.. శాస్త్రవేత్తలు సుదీర్ఘ అధ్యయనానికి బదులు 'స్లీప్ శాండ్‌విచ్'ను సిఫార్సు చేస్తున్నారు. ఈ సెషన్‌లో 'చదువు- నిద్ర- ఇంకాస్త చదువు' ఫార్ములాను అనుసరించాలి. ఎందుకంటే నిద్ర మరింత సమాచారాన్ని స్టోర్ చేసుకోవడంలో సాయపడుతుంది. అపస్మారక స్థితి మీ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో అన్ని రకాల అంశాలను చురుకుగా నిల్వ చేస్తుంది. అలా కాకుండా రాత్రి మొత్తం మేల్కొని చదివితే మెదడు ఆ జ్ఞాపకాలను నిల్వ చేయకుండా నిరోధించడమే. అలసట వల్ల మీ మెదడును పొగమంచు కమ్మేసినట్లుగా ఉత్పాదకత లేని అనుభూతిని కలిగిస్తుంది. అందుకే ఉదయం 4:00 వరకు చదవడం అంత మంచిది కాదు.
* విషయాలను మిక్స్ చేయడం
2008లో పరిశోధకుల బృందం నేర్చుకునే పద్ధతుల్లో కొత్త విషయం కనుగొంది. పర్టిక్యులర్‌గా ఒక విషయాన్ని అధ్యయనం చేయడం ద్వారా మరో విషయం కంటే వేగంగా నేర్చుకుంటారు. ఈ మేరకు అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఆరు చిత్రాల ఆధారంగా కొంతమంది కళాకారులను గుర్తించమని పార్టిసిపెంట్స్‌ను కోరారు. వారిలో సగం మంది ప్రతి కళాకారుడి పెయింటింగ్స్, బ్లాక్స్ చూశారు. మిగిలిన సగం మంది మాత్రం ఆ పెయింటింగ్స్ అన్నింటినీ కలిపి గిలక్కొట్టినట్లుగా చూశారు. అయితే ఇక్కడ రెండో సమూహమే మెరుగ్గా పనిచేసింది. ఎందుకంటే భిన్న శైలులు, విషయాలను పరస్పరం కలుపుకోవడం వల్ల మెమొరీలో కొత్త సమాచారాన్ని పటిష్టం చేయడంలో తోడ్పడుతుంది.
* చూయింగ్ గమ్
కొంతమంది తమ శ్వాసను రిఫ్రెష్ చేసుకునేందుకు చూయింగ్ గమ్ నములుతారు. ఈ అలవాటు మెదడుకు వేగంగా నేర్చుకోవడంలో సాయపడుతుంది. గమ్ నమిలే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండటమే కాక తక్కువ ఒత్తిడిని అనుభవిస్తారని 2011 అధ్యయనం తెలిపింది. పరిశోధకులు అననుకూల పరిస్థితుల్లోనూ ఇందుకు సంబంధించిన అనేక క్విజ్‌లను చేపట్టారు. అయినప్పటికీ చూయింగ్ గమ్ నమిలే వ్యక్తులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. ఈ అలవాటు తక్కువ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను ఉత్పత్తి చేసి ప్రశాంతంగా, ఏకాగ్రతతో పనిచేయడంలో తోడ్పడుతుంది. ఇక 2009, 2015 అధ్యయనాలు సైతం ఈ హ్యాబిట్ దీర్ఘ దృష్టిని పొడిగిస్తుందని, సంతోషాన్నిస్తూ మోటివేట్ చేయడంలో హెల్ప్ చేస్తుందని నిరూపించాయి.