- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుపిటర్ గ్రహం చుట్టూ మరో 12 ఉపగ్రహాలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్ : ఆకాశంలోని వివిధ గ్రహాలలో ఒకటైన జుపిటర్(బృహస్పతి) చుట్టూ ఇంకా 12 రకాల(moons) ఉపగ్రహాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ప్రస్తుతం జుపిటర్ చుట్టూ గల ఉపగ్రహాల సంఖ్య 92కి పెరిగింది. తాజా ఆవిష్కరణతో ప్రస్తుతం మన సౌర వ్యవస్థలో అత్యధిక ఉప గ్రహాలను కలిగిన ఏకైక గ్రహంగా జుపిటర్‌ను పేర్కొంటున్నారు సైంటిస్టులు.
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ సెంటర్ ఆఫ్ మైనర్ ప్లానెట్ జాబితా ప్రకారం బృహస్పతి(జుపిటర్) చుట్టూ అనేక మూన్స్ ఉన్నాయి. 2021-22లలో హవాయి ద్వీపం, చిలీ దేశాల కేంద్రంగా టెలిస్కోప్‌ల ద్వారా ఖగోళా శాస్త్రవేత్తలు జుపిటర్ చుట్టూ ఉన్న నూతన 12 ఉపగ్రహాలను కనుగొన్నారు. కొత్తగా గుర్తించిన ఉపగ్రహాల (మూన్స్) పరిమాణం 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల వరకు ఉంటుందని సైంటిస్ట్ షెప్పర్డ్ తెలిపాడు.
సమీప భవిష్యత్తులో ఈ మూన్స్‌లలో ఒకదాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం ద్వారా తాజా మూన్స్‌కు సంబంధించిన మరిన్ని మూల కారణాలను తెలుసుకుంటామని సైంటిస్టులు చెప్తున్నారు. వివిధ గ్రహాలు, ఉపగ్రహాల గురించి మరింత అధ్యయనం చేయడంలో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఏప్రిల్లో జుపిటర్ పైకి అంతరిక్ష నౌకను పంపనున్నట్టు తెలిపింది. అలాగే నాసా కూడా బృహస్పతి చుట్టూ ఉన్న ఉప గ్రహాలను అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతోంది.
వివిధ గ్రహాలు.. ప్రత్యేకతలు
జుపిటర్, లూనర్ గ్రహాలు వాటి చుట్టూ స్మాల్ మూన్స్‌ను కూడా కలిగి ఉన్నాయని సైంటిస్ట్ షెప్పర్డ్ పేర్కొన్నాడు. అవి ఒకప్పుడు ఉనికిలో ఉన్న బిగ్ మూన్స్ శకలాలుగా సైంటిస్టులు పరిగణిస్తున్నట్లు వెల్లడించాడు. అవి కొన్ని సందర్భాల్లో ఒకదానికి ఒకటి లేదా తోక చుక్కలకు ఢీకొన్న సందర్భాలు కూడా ఉన్నాయని సైంటిఫిక్ స్టడీస్ పేర్కొంటున్నాయి. ఇక యురేనస్ గ్రహం చుట్టూ ఇప్పటివరకు 27 మూన్స్ ఉన్నట్టు గుర్తించబడింది.
అలాగే నెప్ట్యూన్‌కు 14, మార్స్‌కు 2, భూమికి ఒకటి ఉన్నాయి. ఇక శుక్ర, బుధ గ్రహాలకు అసలు ఉపగ్రహాలే లేవు. మరో విషయం ఏమిటంటే ఖగోళ శాస్త్రవేత్తలు జుపిటర్ చుట్టూ కొత్తగా కనుగొన్న 12 ఉపగ్రహాల(మూన్స్) కు ఇంకా పేరు పెట్టలేదు. వీటిలో కొన్ని 1.5 కిలోమీటర్ల పొడవు సైజులో ఉండగా మరికొన్ని అంతకంటే ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.