- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూలైలో క్షీణించిన బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి ప్రభావం నుంచి జూన్‌లో కొలుకున్నట్టు సంకేతాలిచ్చిన బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియంలు జూలైలో పడిపోయాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం తగ్గుదలతో మొత్తం వ్యాపార ప్రీమియంలు సన్నగిల్లాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం, జూలైలో జీవిత బీమా సంస్థల కొత్త వ్యాపార ప్రీమియం రూ. 20,434.72 కోట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కంటే 11 శాతం తక్కువ. అయితే, ప్రైవేట్ బీమా కంపెనీ గతేడాదితో పోలిస్తే ఈసారి కొత్త వ్యాపర ప్రీమియంలలో 7.53 శాతం పెరుగుదలను సాధించాయి.
కరోనాకు ముందు కాలం(2019, జూలై)తో పోల్చినప్పుడు జీవిత బీమా పరిశ్రమ కొత్త వ్యాపార ప్రీమియంలు 5 శాతం పడిపోయాయి. ఇందులో ఎల్ఐసీ 21.42 శాతం క్షీణించగా, ప్రైవేట్ బీమా సంస్థలు 35 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక, ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు బీమా పరిశ్రమలో కొత్త వ్యాపార ప్రీమియం 1.16 శాతం స్వల్ప వృద్ధితో రూ. 73,159.98 కోట్లకు చేరుకుంది. ఇందులో ఎల్ఐసీ సంస్థ కొత్త వ్యాపార ప్రీమియంల విలువ 8 శాతం తగ్గి రూ. 47,631.62 కోట్లు కాగా, ప్రైవేట్ బీమా సంస్థలు 24 శాతం వృద్ధితో రూ. 25,528.26 కోట్లకు చేరుకున్నాయి. సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా బీమా సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంల విక్రయాలు క్షీణించాయని, ప్రైవేట్ బీమా సంస్థలు కొంత మద్దతు ఇచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.