LIC అత్యున్నత పదవుల్లో సంచలన మార్పులు చేసిన కేంద్రం!

by Harish |
LIC
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలోని అత్యున్నత పదవుల్లో కీలక మార్పులను చేసింది. ప్రస్తుతం ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఉన్న పదవిని చీఫ్ ఎగ్జికూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గానూ మార్పులు చెసింది. దీనికి సంబంధించి ఎల్ఐసీ చట్టంలోని నిబంధనల ద్వారా ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్ఎస్) వెల్లడించింది. చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు, సీఈఓ పదవిని సృష్టించేందుకు ఎల్ఐసీ చట్టం, 1956లోని నిబంధనలను సవరించినట్టు తెలుస్తోంది. కాగా, ఎల్ఐసీ ఐపీఓ ద్వారా భారీ నిధులను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం ఇప్పటికే అధీకృత మూలధనాన్ని రూ. 25 వేల కోట్లకు పెంచింది. మొదట ఎల్ఐసీకి చెందిన 5 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదేళ్ల తర్వాత 25 శాతం షేర్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, ప్రస్తుతం ఎల్ఐసీ ఛైర్మన్‌గా ఉన్న ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

Advertisement

Next Story

Most Viewed