- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం పాలసీల ఆదాయం!
దిశ, వెబ్‌డెస్క్: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) జూలై, ఆగష్టు నెలల్లో ప్రీమియం పాలసీల ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. భారీ పెన్షన్లు, టర్మ్ అస్యూరెన్స్ పాలసీల (term assurance policies) అమ్మకాల వల్లే ఈ పెరుగుదల నమోదైంది. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ యాజమాన్య బీమా సంస్థ ఎల్ఐసీ వ్యక్తిగత ప్రీమియంలలో నెలకు 40 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఓ నివేదిక పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీమా రంగం (Insurance sector) దుర్భరంగానే ఉంది. అయితే, ఎల్ఐసీ సంస్థ పెద్ద పాలసీల వైపు దృష్టి సారించడంతోనే ఈ స్థాయి ఆదాయం సాధించినట్టు ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్ తెలిపారు. మధ్యతరగతికి చెందిన వినియోగదారులు ఇప్పుడు రూ. 12-15 లక్షల మొత్తంతో పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. వీరు అంతకుముదు రూ. 7-10 లక్షల మధ్య పాలసీలను కొనుగోలు చేసేవారు. కరోనా సంక్షోభం కొనసాగుతున్న పరిస్థితుల మధ్య ప్రజలు బీమా ఉత్పత్తులను కొనేందుకు కారణమైనట్టు ఆనంద్ వివరించారు.
జులైలో పర్సనల్ సింగిల్ ప్రీమియం (personal single premium) దాదాపు 69 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు చేరుకుంది. ఇది గతేడాది జులైలో రూ. 1,961 కోట్లుగా ఉంది. ఆగష్టులో ప్రీమియం పాలసీల వ్యాపారాని రూ. 18,800 కోట్లను సాధించాలని సంస్థ యోచిస్తోంది. ఇది గతేడాది ఆగష్టుతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అలాగే, రుణాల పోర్ట్‌ఫోలియోలో స్థూల నిరర్ధక ఆస్తులు(NPA) మార్చి నాటికి 8.17 శాతానికి పెరిగిందని, గతేడాది 6.15 శాతంగా ఉందని సంస్థ తెలిపింది. నికర ఎన్‌పీఏ 0.27 శాతం నుంచి 0.79 శాతానికి పెరిగింది.