- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తక్కువ వడ్డీతో గృహ రుణాలిస్తున్న ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహ రుణాల సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ ఎఫ్‌హెచ్ఎల్) సంస్థ గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పరిమిత కాలానికి వర్తించేలా 6.66 శాతం వడ్డీతో రూ. 50 లక్షల వరకు రుణాలను అందించనున్నట్టు వెల్లడించింది. కొత్త రుణాలను కావాలనుకుంటున్న వారికోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. వేతనజీవులెవరైనా ఆగష్టు 31లోపు రుణం మంజూరైన వారు ఈ సదుపాయాన్ని వినియోగించవచ్చని, అయితే, ఈ రుణాన్ని పొందాలనుకునే వారి సిబిల్ స్కోర్‌ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోనున్నట్టు సంస్థ వివరించింది.
కొవిడ్ మహమ్మారి లాంటి సంక్షోభం సమయంలో సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారికి తక్కువ వడ్డీతో రుణాలను అందించడం లక్ష్యంగా కలిగి ఉన్నామని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ కంపెనీ ఎండీ, సీఈఓ వై విశ్వనాథ్ చెప్పారు. ఇంత తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందించడం ఇదే మొదటిసారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా సంస్థ ఆఫీసుకి నేరుగా వెళ్లకుండానె సంస్థకు చెందిన హోమీ యాప్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే ఆమోదం పొందే వీలు కల్పిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.