గ్రంథాలయాలకు అనుమతివ్వండి

by Shyam |
గ్రంథాలయాలకు అనుమతివ్వండి
X

దిశ, మహబూబ్ నగర్: మేధస్సును పెంచుకునేందుకు ఎక్కువ మంది పుస్తక పఠనం చేస్తుంటారు. దీని కోసం గ్రంథాలయాలను అశ్రయిస్తుంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు ఎక్కువగా వీటిని వినియోగించుకుంటారు. కరోనా మహమ్మారి దెబ్బకు మూడు నెలల నుంచి గ్రంథాలయాలు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 66 శాఖా, 15 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. పుస్తకాలు కొనే శక్తిలేని వారు గ్రంథాయాలకు వస్తుంటారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గ్రంథాయాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

Advertisement

Next Story