బ్రేకింగ్.. మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు కలకలం

by Sridhar Babu |
బ్రేకింగ్.. మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు కలకలం
X

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని వీరభద్రవరం, దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు, ఆర్లగూడెం, చిననల్లబెల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి.‌ ఆదివాసీ సంఘాల పేరుతో రోడ్లపై పడేసి ఉన్న కరపత్రాలను స్థానిక ప్రజలు, బాటసారులు ఆసక్తిగా చదువుతున్నారు.

అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలతో మావోయిస్టులు చెలగాటం ఆడుతున్నారని అందులో ఆరోపించారు. మావోయిస్టులు పెడుతున్న మందు పాతరల వల్ల అనేక సందర్భాల్లో అమాయక ఆదివాసీలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. మావోయిస్టుల విధానాలు, చర్యలను కరపత్రాల్లో ఆదివాసీ సంఘాలు విమర్శించాయి. దీంతో స్థానికంగా ఈ కరపత్రాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story