- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాలుష్య పరిశ్రమపై న్యాయపోరాటం చేద్దాం’
దిశ, మెదక్: ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న కాలుష్య పరిశ్రమలు మూతపడే వరకూ న్యాయపోరాటం చేద్దామని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో ప్రతాప్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గోడును వంటేరుకు వెలిబుచ్చుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమ వదిలే వ్యర్థ జలాలు, కాలుష్యంతో శ్వాసకోశ, చర్మ వ్యాధులు వస్తున్నాయన్నారు. భూగర్భ జలాలు కలుషితమై పంటలు పండక భూములు బీడుగా మారుతున్నాయని వాపోయారు. స్పందించిన ప్రతాప్ రెడ్డి ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తానన్నారు. త్వరలో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పరిశ్రమ మూసివేతకు అన్ని చర్యలూ తీసుకుంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఉమ్మడి తూప్రాన్ మండల సహకార సంఘం అధ్యక్షుడు మెట్టు బాలక్రిష్ణారెడ్డి, ఎంపీపీ నవనీత, సర్పంచ్ నాగభూషణం పాల్గొన్నారు.
Tags: vanteru pratap reddy, factory, pollution, medak, ts news