దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరిగిన చిరుత పులుల సంఖ్య ఇలా ఉంది

by Anukaran |   ( Updated:2020-12-21 21:46:40.0  )
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరిగిన చిరుత పులుల సంఖ్య ఇలా ఉంది
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో చిరుత పులుల సంఖ్య 60 శాతం పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ‘స్టేటస్ ఆఫ్ లిపార్డ్ ఇన్ ఇండియా 2018’ పేరుతో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ఆధారంగా 2014 లో దేశ వ్యాప్తంగా 8 వేల చిరుత పులులు ఉంటే 2018 నాటికి చిరుత పులుల సంఖ్య 12,500 పెరిగాయి. ఈ సందర్భంగా ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ 2014 లో 8,000 చిరుత పులులు ఉన్నాయి. పులులు, ఆసియా సింహాలు మరియు ఇప్పుడు చిరుత పులుల జనాభా పెరుగుదలతో మనదేశంలో పర్యావరణం,పర్యావరణ శాస్త్రం మరియు జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుతుందో నిరూపిస్తుందని అన్నారు.
‘స్టేటస్ ఆఫ్ లిపార్డ్ ఇన్ ఇండియా 2018’ పేరుతో కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో పెరిగిన చిరుతపులులు ఈ విధంగా ఉన్నాయి.

వరుస సంఖ్య రాష్ట్రాలు 2018లో సౌత్ ఈస్ట్ ప్రాంతాల్ని కలుపుకొని పెరిగిన చిరుత పులుల అంచనాలు ఇలా ఉన్నాయి
1 బీహార్ 98 (90-106)
2 ఉత్తరాఖండ్ 839 (791-887)
3 ఉత్తర్ ప్రదేశ్ 316 (277-355)
4 శివాలిక్-గాంగెటిక్(శివాలిక్ పర్వతాలు, గంగా నదులు) 1,253 (1,158-1,348)
సెంట్రల్ ఇండియా మరియు ఈస్ట్రన్ ఘాట్స్
1 ఆంధ్రప్రదేశ్ 492 (461-523)
2 తెలంగాణ 334 (318-350)
3 చత్తీస్ గఢ్ 852 (813-891)
4 జార్ఖండ్ 46 (36-56)
5 మధ్యప్రదేశ్ 3,421 (3,271-3,571)
6 మహారాష్ట్ర 1,690 (1,591-1,789)
7 ఒడిశా 760 (727-793)
8 రాజస్థాన్ 476 (437-515)
9 మధ్య భారతదేశం & తూర్పు కనుమలు 8,071 (7,654-8,488)
నార్త్ ఈస్ట్ హిల్స్, మరియు బ్రహ్మపుత్ర మైదానాలు
1 అరుణాచల్ ప్రదేశ్ (పక్కే టైగర్ రిజర్వాయర్) 11 (8-14)
2 అస్సాం (మనస్, నమేరి) 47 (38-56)
3 పశ్చిమ బెంగాల్ (గోరుమారా, జల్దపారా మరియు బుక్సా) 83 (66-100)
4 నార్త్ ఈస్ట్ హిల్స్, మరియు బ్రహ్మపుత్ర మైదానాలు 141 (115-170)

Advertisement

Next Story

Most Viewed