ఫ్లై ఓవర్ పై చిరుత కలకలం.. ఎక్కడంటే?

by Shyam |   ( Updated:2020-11-16 05:48:23.0  )

దిశ, రంగారెడ్డి:
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలు, జన సంచారం తగ్గడంతో అటవీ జంతువులు రోడ్లపై యథేచ్చగా సంచరిస్తున్నాయి.ఈ క్రమంలోనే గురువారం రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి పై చిరుత కనిపించింది. కాలికి గాయమై కదల్లేని స్థితిలో ఉన్న దానిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఎవరికి ఏమీ కాకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ను మళ్లించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ, జూపార్క్‌ సిబ్బంది సంయుక్తంగా చిరుతను బంధించడానికి ట్రై చేయగా, తప్పించుకుని దగ్గరలో ఉన్ ఫంక్షన్‌ హాలులోకి వెళ్లింది. అక్కడ విధుల్లో ఉన్న వాచ్ మెన్ సుభాన్ అనే వ్యక్తిని చిరుత గాయపరిచగా, వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోయిన చిరుతను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed