గేమింగ్ ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసిన లెనోవా

by Harish |
గేమింగ్ ల్యాప్‌టాప్స్ లాంచ్ చేసిన లెనోవా
X

దిశ, వెబ్‌డెస్క్ :

టెక్నాలజీ బ్రాండ్ లెనోవో కంపెనీ లిజియ‌న్ సిరీస్‌లో 3 కొత్త ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. లిజియ‌న్ 7ఐ, లిజియ‌న్ 5పై, లిజియ‌న్ 5ఐ పేరిట ఆ ల్యాప్‌టాప్‌లు విడుద‌లయ్యాయి. లిజియ‌న్ 5ఐ, 7ఐ ల్యాప్‌టాప్‌‌లు ప్రస్తుతం లెనోవా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండగా.. ‘లిజియ‌న్ 5పై’ ల్యాప్‌టాప్‌లు మాత్రం వచ్చే నెలలో మార్కెట్‌లోకి రానున్నాయి. ఇవి స్లేట్ గ్రే, ఫాంటమ్ బ్లాక్, ఐరన్ గ్రే వంటి మూడు రంగుల్లో లభించనున్నాయి.

గేమింగ్ ప్రియులు, కంటెంట్ క్రియేట‌ర్లు, ప్రొఫెష‌న‌ల్ ఆర్టిస్టులను దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాప్‌టాప్‌ల‌ను తీర్చిదిద్దారు. అందువ‌ల్ల ఆయా రంగాల్లోని వారికి ఈ ల్యాప్‌టాప్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. హెవీ డ్యూటీ టాస్క్‌ల‌ు కూడా వేగంగా నిర్వ‌హించ‌వ‌చ్చు. లిజియ‌న్ 7ఐలో ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే, డాల్బీ విజ‌న్‌, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, ఇంటెల్లిజెంట్ కూలింగ్ సిస్ట‌మ్, 8 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇంటెల్ కోర్ ఐ9 హెచ్ సిరీస్ 10వ జ‌న‌రేష‌న్ మొబైల్ ప్రాసెస‌ర్‌ అందిస్తున్నారు. కాగా లిజియ‌న్ 5పై, 5ఐ ల్యాప్‌టాప్‌ల‌లో ఇంటెల్ కోర్ ఐ7-10750హెచ్ 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన ఫీచ‌ర్ల‌న్నీ దాదాపుగా ‘లిజియ‌న్ 7ఐ’లో ఉన్నవే. లిజియ‌న్ 7ఐ ల్యాప్‌టాప్ ప్రారంభ ధ‌ర రూ.1,99,990/- ఉండ‌గా, లిజియ‌న్ 5పై ప్రారంభ ధ‌ర రూ.1,34,990/-గా ఉంది. ఇక రూ.79,990/- ప్రారంభ ధ‌ర‌కు లిజియ‌న్ 5ఐ ల్యాప్‌టాప్ ల‌భిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed