- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణను దోచుకునేందుకే కొత్తపార్టీలు
దిశ, నల్లగొండ: తెలంగాణను దోచుకునేందుకు కొత్తపార్టీలు పుట్టుకొస్తున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తసుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గుత్తా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి హయాంలో అయితే హైదరాబాద్ లో అల్లకల్లోలం సృష్టించి ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకువచ్చి వేటకొడవళ్లు, కత్తులు తిప్పారో వారే రాష్ట్రంలో కొత్తపార్టీని స్థాపిస్తామంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయం నెంబర్ వన్ స్థానంలో ఉందని, కరోనా సమయంలో రాష్ట్రాలన్నీ మైనస్ రెండు జీడీపీలో ఉంటే, తెలంగాణాలో పతాక స్థాయికి చేరుకుందని చెప్పారు. తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వాలు దుర్భిద్దితో ఆంధ్రాకు నీళ్లను, నిధులను తరలించి, భూములను కబ్జాలుచేశారని ఆరోపించారు. కాగ్రెస్ నాయకులు పాలనలో 2014వరకూ తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సుస్థిర ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకే కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయని, ఆశకు హద్దు ఉంటుందని విమర్శిచారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే వారి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. తెలంగాణలో గడీల పాలన లేదని, ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగుగుతోందని పేర్కొన్నారు. కులాల పేరుతో మతాల పేరుతో, ప్రజలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని కొన్ని శక్తులు గోతికాడి నక్కలా చూస్తున్నాయని, తస్మాత్ జాగ్రత్తా ప్రజలంతా జాగురుకతతో ఉన్నారని హెచ్చిరించారు.
తెలంగాణ ను అస్థిర పరిచే శక్తులకు ఇక్కడ స్థానం లేదని వారికి అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డివి బ్లాక్ మెయిల్ రాజకీయాలని, బినామీ పేర్లతో కాంట్రాక్టులు సంపాదించుకున్న వ్యక్తి అని ఆరోపించారు. తనను విమర్శించే స్థాయి, హక్కుకూడా రేవంత్ రెడ్డికి లేదని, ఆయన ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నాయకుడని ఎద్దేవా చేశారు. పెయింటింగ్ చేసుకునే వ్యక్తి, రేంజ్రోవర్ కారులో ఎలా తిరుగుతున్నాడని ప్రశ్నించాడు. తానేంటే నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసని, తాను కొత్తగా సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు.