క(మీషన్) భగీరథ నీటిలో జలగ.. షాకైన గ్రామస్తులు

by Sridhar Babu |
క(మీషన్) భగీరథ నీటిలో జలగ.. షాకైన గ్రామస్తులు
X

దిశ, పెద్దపల్లి : మిషన్ భగీరథ నీటిలో జలగ ప్రత్యక్షమైంది. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట అనుబంధ గ్రామం నేతకాని పల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్ అనే వ్యక్తి రోజులాగే మిషన్ భగీరథ వాటర్ నల్లా నీళ్లు పడుతుండగా అందులో నుంచి జలగ రావడం గమనించి అవాక్కయ్యాడు.

ఇది చూసిన ఇరుగు పొరుగు వారు భయాందోళనకు గురవుతున్నారు. వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకం అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలా జలగలు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు అన్నారు. గతంలో ఇదే గ్రామంలో రెండు సార్లు మెయిన్ పైప్ లైన్ పగిలి ఊర్లోని ఇండ్లు నీటితో నిండాయి. మరమ్మతులు చేయడానికి నెలల కొద్దీ సమయం తీసుకున్నారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా లీకేజీలను గుర్తించి సరి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని బీజేపీ మండల ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed