- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా ట్రెండ్..ఆకుపై బొమ్మలు
దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్‌లో చాలా సమయం దొరకడంతో అందరూ తమలో దాగి ఉన్న కళను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కేరళకు చెందిన లీఫ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు కూడా తమ గ్రూప్‌ను పాపులర్ చేసుకునే పనిలో పడి, ఇప్పుడు విజయం సాధించారు. ఆకుల మీద కత్తితో కత్తిరించుకుంటే బొమ్మలు వేసే ఆర్టిస్ట్‌ల గ్రూప్ ఇది. కొబ్బరి ఆకుల మీద సినిమా తారల బొమ్మల నుంచి చిన్న చిన్న ఆకుల మీద అందమైన డిజైన్లను వీళ్లు వేస్తారు. ఇవి చూడగానే అబ్బురపరచడంతో పాటు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కేరళ లీఫ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రారంభమైనప్పుడు అందులో సభ్యులు నలుగురు మాత్రమే. కానీ, ఇప్పుడు దాదాపు 80 మంది ఉన్నారు. బ్యాంక్‌లో పనిచేసే మను కేఎం మూడేళ్ల క్రితం ప్రత్యేకమైన ఆర్ట్ రూపాలు ప్రయత్నించాలనుకున్నాడు. వాటి మీదనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో కాఫీ పొడి, ఇసుక ఆర్ట్ మీద దృష్టిసారించారు. తర్వాత ఆన్‌లైన్‌లో చూసి, లీఫ్ ఆర్ట్ మీదకు మళ్లాడు.
మొదట్లో ఆకుల మీద జంతువుల బొమ్మలు, పువ్వులు వేయడం ప్రాక్టీసు చేశాడు. తర్వాత నెమ్మదిగా చిత్రాలు, ఫొటోలు గీయడంలో అనుభవం పొందాడు. ఇప్పుడు మను కేఎం ఇన్‌స్టాగ్రామ్ పేజీ (aesthetic._.soul) చూస్తే ఆకుల ఆర్ట్‌తో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత తనలాంటి ఔత్సాహిక ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించడానికి కేరళ లీఫ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను మను ప్రారంభించాడు. కొత్తగా నేర్చుకోవాలనుకున్నవాళ్లు ఈ గ్రూప్‌లో చేరి, ఇప్పటికే ఉన్న ఆర్టిస్ట్‌లతో శిక్షణ పొందవచ్చు. సాధారణంగా లీఫ్ ఆర్ట్ వేయడానికి వీళ్లు పనస, కొబ్బరి, టేకు ఆకులను ఉపయోగిస్తారు. కొబ్బరి ఆకుల మీద గీసిన సెలెబ్రిటీల ఫొటోలు అయితే చాలా పాపులర్. ఈ గ్రూప్ సభ్యులు ఇన్‌స్టాగ్రాంలో తమ ఆర్ట్‌ను షేర్ చేశాక, ఎంతోమంది వాళ్లను అప్రోచ్ అయినట్లు మను తెలిపారు. వాళ్లందరూ పెళ్లిదినోత్సవం, పుట్టినరోజులకు పర్సనలైజ్డ్ ఆర్ట్‌లు వేయించుకుని, డబ్బులు చెల్లించేవారు. కొబ్బరి ఆకు మీద మను వేసిన విజయ్ సేతుపతి చిత్రానికి చాలా ప్రశంసలు వచ్చాయి. స్వయంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రశంసిస్తూ లెటర్ పంపించారు. లీఫ్ ఆర్ట్ మీద పూర్తిగా దృష్టి సారించడానికి మను తన ఉద్యోగాన్ని వదిలేసి, ఔత్సాహిక ఆర్టిస్ట్‌లకు ఆదర్శంగా నిలిచారు.