ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ అనిల్ ధార్కర్ కన్నుమూత

by Anukaran |   ( Updated:2021-03-26 01:32:47.0  )
ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ అనిల్ ధార్కర్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : సాహిత్య రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, జర్నలిస్ట్‌ అనిల్ ధార్కర్ ఇకలేరు. గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతున్న అనిల్ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అనిల్ ధార్కర్ సాహిత్య రంగానికి ఎనలేని సేవలు అందించారు. ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్’ అనే పుస్తకం ధార్కర్ కలం నుండి జాలువారిందే. మిడ్‌-దే, ది ఇండిపెండెంట్‌, ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా తో సహా పలు పత్రికలకు అనిల్ ధార్కర్ సంపాదికుడిగా పనిచేసారు. ధార్కర్ మృతి పట్ల పాత్రికేయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Next Story