- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతలదే హవా!
దిశ, తెలంగాణ బ్యూరో: వరద బాధితులకు సాయం పంపిణీ సోమవారం నుంచి మొదలైంది. ఇందుకోసం అధికారులు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రతి బాధిత కుటుంబానికీ పది వేల రూపాయల సాయం అంది స్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎంతో సదుద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంపై అప్పుడే రాజకీయ నీలి నీడలు అప్పుడే కమ్ముకున్నాయి. చాలా మంది బాధితులు వరదల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. జాబితా తయారీ, నగదు సాయం పంపిణీపై అనుమానాలు కలుగుతున్నాయి. జాబితా తయారీలో స్థానిక రాజకీయ నాయకుల హవా నడుస్తోంది.
ప్రభుత్వం ప్రకటించినట్టుగా కమిటీగానీ, స్పెషల్ ఆఫీసర్గానీ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగానికి చెందిన అధికారులుగానీ ఇంటింటికి తిరగడం లేదు. స్థానిక నాయకులే జాబితాను తయారు చేస్తున్నారు. అందులో చాలా పొరపాట్లు దొర్లుతున్నాయి. వాస్తవంగా బాధితులు ఎవరు? పేర్లు నమోదు చేసుకుంటున్న వారెవరు? గుర్తించే ప్రయత్నాలు జరుగడంలేదు. దీంతో ప్రభుత్వం సహాయం చేతులు మారడం ఖాయమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాలాపేట్, మల్కాజిగిరి పరిధిలో ‘దిశ ’ప్రతినిధి ప్రత్యక్షంగా పరిశీలించినపుడు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అధికారులెక్కడ?
వరద పీడిత ప్రాంతాలలో అధికారులెవ్వరూ కనిపించడంలేదు. యాప్ లో బాధితుల ఆధార్ వివరాలను నమోదు చేయడంలేదు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ సూచనల మేరకు స్థానిక నాయ కులు జాబితాను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడంలేదు. బాధితులతోపాటు, బాధితులు కానివారు కూడా జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబంలోని ఇద్దరికి లేదా ముగ్గురికి కూడా సాయం అందేలా ఉంది. బహుళ అంతస్థుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి నష్టం జరిగితే, పై అంతస్థుల్లోని మొదటి, రెండు, మూడు ఫ్లోర్ ల్లోని కుటుంబాలు కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాయి. నీళ్లు చేరని ఇళ్లవారు కూడా ఇద్దరేసి పేర్లను రాయించుకుంటున్నారు.
బాధితులు ఇదేమని ప్రశ్నిస్తే, ఇదే ఫైనల్ కాదుకదా..అని జాబితా రాసుకునే వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇంటిలో ఎన్ని కుటుంబాలున్నాయి? కుటుంబంలో ఎందరున్నారు? అద్దెకు ఎన్ని కుటుంబాలున్నాయి? అనేది చూడటం లేదు. ఇల్లు దెబ్బతిన్నదా? లేదా? ఇంటి గోడ కూలిందా? విలువైన వస్తువులేమైనా పోయాయా? వాస్తవ నష్టమెంత కూడా పరిశీలించడం లేదు. తమ ఇంటి గోడ కూలిందని, గేట్లు పడిపోయాయని, ఇంట్లో బెడ్లు, ఫ్రీజ్, టివి, మిక్సీ వంటివి కొట్టుకుపోయాయని, వాటి వివరాలు ఎవ్వరికి ఇవ్వాలి? అని కొందరు అడుగుతున్నారు. ముందు జాబితాలో పేరు రాసుకోండి. తర్వాత ఎంఎల్ఎ, అధికారులు వచ్చినప్పుడు వివరాలు చెప్పండి అని నాయకులు సలహాలిస్తున్నారు.