- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రభుత్వ టీచర్ భూకబ్జాలు.. వందలాది ఎకరాలు మాయం’
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ భూకబ్జాలకు పాల్పడుతూ.. వందలాది ఎకరాల ఆదివాసీ భూములను దోచుకుంటున్నడని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెంకోటి అన్నారు. శుక్రవారం మండలంలోని గుట్టమల్లారంలోని అసైన్మెంట్ భూముల వద్ద ఆయన విలేకరులతో మాట్లడుతూ.. అశ్వాపురం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ టీచర్ భూకబ్జాలకు పాల్పడుతూ.. వందలాది ఎకరాల ఆదివాసీ భూములను బెదిరించి దోచుకుంటున్నడని ఆయన మండిపడ్డారు. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ టీచర్ అమాయకమైన గిరిజనులను బెదిరించి భూములను లాక్కుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలో చిట్టీల వ్యాపారం చేస్తూ, అమాయక గిరిజలను చిట్టీల ఊబిలో దింపి, గిరిజనులపై వడ్డీలు, బార్ వడ్డీలు, చక్రవడ్డీలు వేస్తూ కోట్లు సంపాదిస్తున్నడని తెలిపారు. చిట్టీల వ్యాపారమే కాకుండా ఫెర్టిలైజర్ వ్యాపారంతో కూడా గిరిజన రైతులపై అడ్డంగా నిలువుదోపిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. ఆయన అక్రమాలపై ఇప్పటికే స్థానిక తహసీల్దార్‌కి ఫిర్యాదు చేశామని తెలిపారు. కానీ ఏ ఒక్క అధికారి ఇతనిపై చర్యలు తీసుకోలేదని వివరించారు. ఆయనపై ప్రభుత్వం దృష్టి సారిస్తే అక్రమ ఆస్తులు బయటకు వస్తాయని తెలిపారు. ఇప్పటికైనా ఆయన ఆస్తులపై సీబీఐ ద్వారా విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకొని, అక్రమంగా దోచుకున్న ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తుడుండెబ్బ నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.