భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులు

by Shyam |
భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న లక్ష్మాపూర్ గ్రామస్తులు
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం లక్ష్మాపూర్ గ్రామం మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురికానుంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని 389 కుటుంబాలకు ఆర్ఎంస్ఆర్ ప్యాకేజీ అందజేయడంతో పాటు పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామస్తులను గజ్వేల్ మండలం సంగాపూర్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం రోజు అధికారులు గ్రామానికి వాహనాలను తీసుకెళ్లి ఇళ్లను ఖాళీ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్లుగా అందరితో కలిసి మెలిసి ఉన్న ఊరును విడిచిపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. మహిళలు ఒకరినొకరు పట్టుకుని రోదించిన తీరు అక్కడున్నవారిని కలచివేసింది. అనంతరం చెమ్మగిల్లిన కళ్లతో భారంగా ఊరు విడిచి వెళ్లిపోయారు.

tag: laxmapur, mallannasagar, Reservoir, medak, ts news

Advertisement

Next Story

Most Viewed