పల్లె ప్రగతి ఎఫెక్ట్ : లక్ష్మాపూర్ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

by Shyam |   ( Updated:2021-07-08 06:50:46.0  )
collecter-sharath
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పల్లెల పరిశుభ్రత అందరీ సమిష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు, లక్ష్మాపూర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల కు ఏర్పాటుచేసిన రక్షణ గార్డులు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి ముఖిద్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఆర్డీఓ శీను, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఇన్చార్జి కమిషనర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed