భార్యకు 1500 స్టెరాయిడ్‌లు ఎక్కించిన లాయర్.. ఆపై అందరితో కలిసి..

by Sumithra |   ( Updated:2021-08-17 09:47:07.0  )
Abortion for wife
X

దిశ, వెబ్‌డెస్క్ : కుటుంబీకులంతా ఉన్నత విద్యావంతులే. తల్లి, కొడుకు చట్టాన్ని, న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు. కూతురు ప్రాణాలు కాపాడే వైద్యురాలు. కానీ ‘చెప్పడానికే నీతులు’ అన్నట్లు వీరంతా కలిసి అటు చట్టాన్ని, ఇటు ప్రాణాలను సమాధి చేశారు. ఇలా ఒక్కసారి, రెండుసార్లు కాదు.. ఏకంగా 8 సార్లు చేసి తమ పైశాచికాన్ని ప్రదర్శించుకున్నారు. కోడలికి కుమారుడు పుట్టాలని భ్రూణ హత్యలకు పాల్పడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబైకి చెందిన యువతికి, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. భర్త, అత్త న్యాయవాదులు కాగా, ఆడపడుచు వైద్యురాలిగా పని చేస్తోంది. ఆర్థికంగా ఏ లోటు లేదు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే తన ఆస్తులకు, వంశానికి వారసుడు కావాలని భర్తతో పాటు అత్త.. కోడలితో గొడవకు దిగేది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చి 2009లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మొదటిసారి కాన్పు కాబట్టి సర్ధుకుపోయారు అత్తాంటివారు. సదరు వివాహిత 2011లో మళ్లీ గర్భం దాల్చింది. అయితే మళ్లీ ఆడపిల్ల పుడితే కష్టమని భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు అత్తాంటివారు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించారు. ఇలా పదేళ్లుగా ఎనిమిదిసార్లు గర్భం దాల్చిన భార్యకు అబార్షన్ చేయించారు.

ప్రస్తుతం 40 ఏళ్ల వయసు వచ్చిన భార్యను బ్యాంకాక్ తీసుకెళ్లి మరో అకృత్యానికి పాల్పడ్డాడు భర్త. భారత్‌లో చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని గుర్తించిన ఆ లాయర్.. బ్యాంకాక్ లో గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేయించాడు. అంతటితో ఆగక మగ సంతానం కోసమని ఆమెకు 1500 హార్మోనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఎక్కించి తీవ్రంగా హింసించాడు. భర్త ఉన్మాదాన్ని ఆలస్యంగా గుర్తించిన భార్య.. ముంబైకి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతోపాటు అత్తామామలపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్య.. ప్రియుడి గొంతు కోసి..!

Advertisement

Next Story