- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ రీఎంట్రీకి డోర్స్ ఓపెన్ ?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయ్యిందా..? ధోనీకి చివరి ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ పెద్దలు సుముఖంగా ఉన్నారా..? అంటే, ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. గురువారం బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ధోనీ ఫొటో ఉంచడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. చిరునవ్వులు చిందిస్తున్న ధోనీ ఫొటోను పోస్టు చేసి దానికి ‘చిరునవ్వులు చిందల్సాంది ఇలాగే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
వన్డే ప్రపంచ కప్ తర్వాత జట్టుకు దూరమై, కాంట్రాక్టు కూడా పోగొట్టుకున్న ఎంఎస్ ధోనీ.. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. కాగా, గత కొన్ని నెలలుగా ధోనీ పునరాగమనం కష్టమని, అతడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని పలు రూమర్లు బయటకువచ్చాయి. కానీ, ధోనీ వేటిపైనా స్పందించలేదు. తాజాగా ఐపీఎల్‌లో రాణిస్తేనే అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టుకు పరిశీలిస్తామని కోచ్ రవిశాస్త్రి చెప్పిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడు ఐపీఎల్ కూడా రద్దవుతున్న పరిస్థితుల్లో ధోనీ పునరాగమనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటు ఫ్యాన్స్ కూడా ధోనీని అంతర్జాతీయ వేదికలపై చూడటం ఇక కష్టమే.. అని అనుకున్నారు.
Smile is the way to be 😊😊 pic.twitter.com/ugUwyLVpj4
— BCCI (@BCCI) March 19, 2020
కాగా, ఈ మయంలో బీసీసీఐ ధోనీ ఫొటో పోస్ట్ చేసి దానికి ఒక అందమైన క్యాప్షన్ జత చేయడంతో.. ధోనీ పునరాగమనం ఖాయమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అతడి రీ ఎంట్రీకి సంకేతమని భావిస్తున్నారు.
Tags: MS Dhoni, Re Entry, IPL, BCCI, Caption on twitter, T20W cup