- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడియో వైరల్.. యూట్యూబర్ అరెస్ట్.. కారణం ఏంటంటే?
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రిన్స్ దీక్షిత్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీక్షిత్ గత ఏడాది డిసెంబర్ 16న తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అక్షరధామ్ నుంచి ఘజియాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై కదులుతున్న కార్ల పైన తన స్నేహితులతో కలిసి నిలబడి వేడుకలు చేసుకున్నాడు.
ఈ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ‘ఈ వీడియో.. దాంట్లో ఉల్లంఘనలు మా దృష్టికి వచ్చాయి. అందులోని నేరస్థులను గుర్తించడానికి, సంఘటన ఏం టైంలో జరిగిందో.. తదితర వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నేరస్థులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వైరల్ వీడియోలలో, యూట్యూబర్ అతని స్నేహితులు కదులుతున్న కార్ల పైకప్పులపై, నేపథ్యంలో బిగ్గరగా సంగీతం ప్లే చేస్తూ అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం చూడవచ్చు.
దీక్షిత్ పుట్టినరోజు కావాల్‌కేడ్‌లో కొంతమంది కార్ల కిటికీలను తెరిచి అందులో నుంచి బయటికి రావడం,కొంతమంది బోనెట్‌లపై నృత్యం చేయడం కూడా కనిపిస్తుంది. దీక్షిత్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఈ స్టంట్‌లో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ये वीडियो गाजियाबाद का बताया जा रहा है
— Nigar Parveen (@NigarNawab) March 15, 2023
बीच सड़क पर दारू,असलहा, स्टंट और फुल टशन। बाकी तो छोड़िए कार पर लगा भाजपा का झंडा देखिए
अब सत्ताधारी ही कानून की धज्जियां उड़ाकर उसका वीडियो बनाकर मजाक उड़ा रहे हैं pic.twitter.com/zm5WbVrHI4