125 అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఇవే!

by GSrikanth |
125 అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలు ఇవే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్​ విగ్రహం నిర్మాణం పూర్తయ్యింది. భారతావనికే తలమానికంగా నిలిచే ఈ నిర్మాణానికి ఏడేళ్ల సమయం పట్టింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ టాంక్‌బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు సీఎం 2016లో ప్రకటించారు. దానికి అనుగుణంగా 2016 ఏప్రిల్ 14న ఎన్టీఆర్ పార్కు పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూమిపూజ కూడా చేశారు. ఏడాది కాలంలో (2017 ఏప్రిల్ 14 నాటికి) నిర్మాణం పూర్తయ్యేలా టార్గెట్ ఫిక్స్ చేశారు.

= విగ్రహం నమూనా కోసం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్​తో కూడిన సబ్​ కమిటీ 2017 ఫిబ్రవరిలో చైనాలో పర్యటించింది.

= అనేక వాయిదాల తర్వాత 2023 ఏప్రిల్ 14న ఓపెన్ కావాల్సిందేనంటూ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌కు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ రంగంలో అనుభవం ఉన్న మహారాష్ట్రకు చెందిన పద్మభూషణ్ రాం వంజీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్ సుతార్​కు డిజైన్ బాధ్యతలు అప్పగించారు. వీరు రూపొందించిన నిలువెత్తు విగ్రహ నమూనాకు ప్రభుత్వం ఆమోదించింది.

= ఈ నెల 30కల్లా విగ్రహం పనులు పూర్తి చేసి ఆ తర్వాతి రోజుల్లో గార్డెనింగ్, బేస్‌మెంట్‌లోని ఇంటీరియర్ పనులపై దృష్టి పెట్టనున్నారు.

= ఏడాదిలో నిర్మిస్తారని ప్రకటించినా అంబేద్కర్​ విగ్రహ ఏర్పాటుకు ఏడేళ్ల నిరీక్షణ తప్పలేదు.

= పార్లమెంటు ఆకృతిలో నిర్మిస్తున్న బేస్‌మెంట్‌కు ఆగ్రా, నొయిడా, జైపూర్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఎరుపు, గోధుమ రంగుల రాళ్లను నిర్మాణ సంస్థ వాడుతున్నారు. విగ్రహంలోని బూట్లు, కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగం పుస్తకం, భుజాలు, ముందుకు చూపుతున్నట్లు ఉండే కుడిచేయి, తల తదితరాలన్నింటినీ విడివిడి భాగాలుగా నొయిడాలో కంచుతో తయారుచేసి లారీల ద్వారా తరలించారు.

= విగ్రహం పటిష్టంగా ఉండేందుకు లోపలివైపు స్టీల్ స్ట్రక్చర్‌ను వాడుతున్నారు. విడివిడి భాగాల మొత్తం అమరిక పూర్తయిన తర్వాత పాలీ యూరేథీన్ కెమికల్స్ తో కోటింగ్ (పాలిషింగ్) చేయనున్నారు. టాంక్‌బండ్ నీటి కాలుష్యంతో పాటు గాలిలోని రసాయనాల, వాతావరణ మార్పులతో విగ్రహం షైనింగ్ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

= అతి భారీ తుపానులను కూడా తట్టుకునేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

= అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించేలా మ్యూజియంలో అంబేద్కర్ చిత్రపటాలే, రాజ్యాంగం తయారీ కోసం పడిన శ్రమను వివరించే ఫొటోలు ఉంటాయి.

ప్రత్యేకతలు

విగ్రహం ఎత్తు : 125 అడుగులు

వెడల్పు : 45 అడుగులు

బేస్‌మెంట్‌ ఎత్తు : 50 అడుగులు

లొకేషన్ : టాంక్‌బండ్ ఎదురుగా ఎన్టీఆర్ గార్డెన్ పక్కన

విస్తీర్ణం : మొత్తం 11.4 ఎకరాల స్థలంలో

వాడుతున్న స్టీల్ : 155 టన్నులు

విగ్రహానికి వాడే కంచు : 111 టన్నులు

విగ్రహం ఔటర్ లేయర్‌కు : 9 టన్నుల కంచు

కోటింగ్ : పాలీ యురేథీన్ పాలిషింగ్

మొత్తం వ్యయం : రూ. 146 కోట్లు

నిర్మాణ సంస్థ : కేపీసీ ప్రాజెక్టు ప్రై. లి.

డిజైనర్ : పద్మభూషణ్ రాం వంజి సుతార్ , ఆయన కుమారుడు అనిల్ సుతార్

బేస్‌మెంట్‌లో ఏముంటాయి? : మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ కాన్ఫరెన్సు హాల్

బేస్‌మెంట్ నమూనా : ఢిల్లీలోని పార్లమెంటు ఆకృతిలో

లాంఛన ప్రారంభోత్సవం : ఏప్రిల్ 14, 2023 (అంబేద్కర్ జయంతి)

భూమి పూజ : 2016 ఏప్రిల్ 14న (అంబేద్కర్ జయంతి) సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు

టార్గెట్ : ఏడాది లోపు పూర్తికావాలన్నది లక్ష్యం

అన్వేషణ : 2017లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల, ఎమ్మెల్యేల బృందం చైనాలో పర్యటించింది. భారీ విగ్రహాలను పరిశీలించి డీపీఆర్ సమర్పించాల్సిందిగా ఏరోసెల్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది.

Advertisement

Next Story

Most Viewed