సీఎం రేవంత్​రెడ్డికి పీఎం మోడీ శుభాకాంక్షలు

by Sridhar Babu |   ( Updated:2023-12-07 10:17:40.0  )
సీఎం రేవంత్​రెడ్డికి పీఎం మోడీ శుభాకాంక్షలు
X

దిశ, వెబ్​డెస్క్​ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా (ట్విట్టర్​ లో) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తాము అన్ని విధాలుగా సహకరిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ట్విట్​ చేశారు. కాగా అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed