- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వాటర్ డే 2022: నీరు ఇలా అయ్యిందా..?! మనమేం చేయాలి?
దిశ, వెబ్‌డెస్క్ః నీటికున్న విలువ వెలకట్టలేనిదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జీవికి ఆక్సిజన్ ఎంత అవసరమో దైనందిన జీవితంలో నీటి అవసరం అలాంటిదే. అయితే, పది అడుగులు తవ్వతే నీరు పడే భూమి నుండి వందల అడుగులు చీల్చినా చుక్క నీరు కనిపించని కరువు ప్రాంతాలూ ఇదే భూమిపై ఉన్నాయని మనందరికీ తెలుసు. కాలం మారుతోంది.. నది పక్కనే బతుకుతున్నగ్రామాల్లో కూడా మినరల్ వాటర్ టిన్నులు కొనుక్కు, తాగుతున్న కాలం దాపురించింది. నానాటికీ పరిస్థితి దిగజారుతోంది. మనం ఇప్పుడు నీటిని పొదుపు చేయడానికి సరైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాల ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే, ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు లేకుండానే జీవితాన్ని బలిచేసుకుంటున్నారు. ఈ తరుణంలో నీటి కొరతపైన అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఆచరిస్తోంది.
మితిమీరిన కాలుష్యం, భూగర్భ జలాలను వృధా చేస్తున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంచినీటి లభ్యత మరింత తగ్గిపోయింది. ఈ క్రమంలో భూగర్భ జలమట్టం తగ్గడం కూడా మరో ప్రధాన సమస్యగా మారింది. అందుకే, 'సుస్థిర అభివృద్ధి లక్ష్యం'గా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనితో, 2030 నాటికి అందరికీ నీరు, శానిటేషన్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇక, సైన్స్ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, నీటి వనరుల్లోని కలుషితాలను తొలగించలేకపోయాము. ఇలాంటి ఎన్నో సమస్యలపై అవగాహన కల్పించడానికి, వాటికి పరిష్కారం కనుగొనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రపంచ నీటి దినోత్సవం అవసరం చాలా ఉంది.
ప్రపంచ నీటి దినోత్సవం 2022 నాడు మనం ఏంచేయొచ్చు?
- నీటి సంరక్షణ గురించి అవగాహన పెంచడానికి, నీటి సంరక్షణ ప్రాజెక్ట్‌లలో చురుకుగా పాల్గొనడానికి మన పరిసరాల్లో, సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించడం.
- మన ఇంట్లో నీటి వినియోగాన్ని సక్రంగా చూడాలి. అనవసరంగా నీటిని వృధా చేయకుండా, నీటిని ఆదా చేసే మార్గాలను గుర్తించాలి.
- రోజువారీ కార్యకలాపాల్లో నీటిని సంరక్షణకు సహాయపడే మార్గాల గురించి కొత్త పద్ధతులను అన్వేషించడం, ఆచరించడం, అలాగే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రచారం చేయడం. ఉదాహరణకు, స్నానం చేయడానికి షవర్‌కు బదులుగా బకెట్లను ఉపయోగించడం.
- ఇంకా.. భూగర్భ నీటిని పెంచడంలో మనవంతుగా పనిచేయడం.