అమిత్ షా కు మావోయిస్టుల హెచ్చరిక.. బస్తర్ డివిజన్‌లో హై అలర్ట్‌!

by GSrikanth |
అమిత్ షా కు మావోయిస్టుల హెచ్చరిక.. బస్తర్ డివిజన్‌లో హై అలర్ట్‌!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా యత్ రాజ్ పాడ్‌లో మావోయిస్టులు నిరసనలు తెలుపుతున్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్థానిక గిరిజనులతో కలిసి లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ర్యాలీలో అత్యాధునిక ఆయుధాలతో మావోయిస్టులు పాల్గొన్నారు. మార్చి 25న బస్తర్‌లో జరగబోయే సీఆర్ పీఎఫ్ 85వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి అమిత్ షా రాబోతున్నారు.

హోంమంత్రి పర్యటన నేపథ్యంలో సుక్మా జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అమిత్ షా బస్తర్ రావొద్దంటూ స్థానికులతో కలిసి మావోయిస్టులు తేల్చి చెబుతున్నారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులతో కలిసి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. నిరసనల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచామని సున్నితమైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed