స్నేహం కోసం... ఎంత పని చేశాడంటే...

by Shiva |
స్నేహం కోసం... ఎంత పని చేశాడంటే...
X

దిశ, వెబ్ డెస్క్ : తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడి చితిలోకి దూకి ఓ వ్యక్తి ప్రాణ త్యాగానికి పాల్పడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అశోక్(42) అనే వ్యక్తి గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతూ మృతిచెందాడు. యమునా నది తీరంలో జరిగిన అంత్యక్రియల్లో అతని మిత్రుడు ఆనంద్(40) పాల్గొన్నాడు. అశోక్ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ అకస్మాత్తుగా చితిలోకి దూకాడు. దీంతో పక్కనున్న వారు బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు ఆగ్రాకు తీసుకెళ్తుండగా ఆనంద్ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు.

Advertisement

Next Story