- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ పర్యటనకు ముందురోజు టీ-కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 8న మంచిర్యాలలో జరగాల్సిన కాంగ్రెస్ సభ వాయిదా పడింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా రావాల్సిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పర్యటన ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. దీంతో రేపటి సభను ఈ నెల 11న నిర్వహించాలని పార్టీ డిసైడ్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని ప్రజల్లోకి మరింత చేరువయ్యేలా కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఒకవైపు నేతలు పాదయాత్రలు చేస్తూ మరో వైపు సభలపై ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8న నస్పూర్‌లో బహిరంగ సభకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 250 కిలోమీటర్లకు చేరిన సందర్భంగా నస్పూర్‌లో సభను ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణ చేపట్టాలని కాంగ్రెస్ భావించింది. ఇంతలో ఈ మీటింగ్ వాయిదా పడింది. అయితే రేపే తెలంగాణలో మోడీ పర్యటన కూడా ఉంది. సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో మోడీ బహిరంగ సభలో హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ వాయిదా పడటం హాట్ టాపిక్ అయింది.