- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి ఇంటి ఎదుట మౌనపోరాటం
దిశ, నర్సంపేట: రెండేళ్లుగా ప్రేమ పేరుతో పరిచయం పెంచుకుని అనంతరం కాదనడంతో ఆ ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌన పోరాటం చేస్తున్న సంఘటన నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం శివారు చిన్న తండాలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థికి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తున్న రుద్రగూడెం గ్రామ శివారు చిన్న తండాకు చెందిన మూడు సారయ్య భద్రమ్మ దంపతుల కుమారుడు సుమన్ తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. రెండేళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ ఇటీవల పెళ్లి చేసుకోనని బాధితురాలిని నిరాకరించడంతో పాటు భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు శుక్రవారం ఉదయం ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం విరమించేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో ఆమెకు దళిత సంఘాలు అండగా నిలిచాయి. దళిత సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కల్లెపల్లి ప్రదీప్ మాదిగ, దళిత విద్యావంతుల వేదిక గ్రామీణ జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, ఏబి ఎస్ ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ బొట్లనరేష్, తదితర దళిత సంఘాలు పాల్గొన్నాయి. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పేర్కొంది.