- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన మీద ఈగ వాలనివ్వం
దిశ, సిద్ధిపేట: పేద విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న స్వేరో వ్యవస్థాపకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటేనే మనువాదులకు గిట్టడం లేదని స్వెరో జిల్లా అధికార ప్రతినిధి బండ నర్సింలు అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో స్వేరో సభ్యత్వాల అనంతరం ఆయన ప్రసంగించారు. స్వేరో సుప్రీం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల బాధ్యత చేపట్టినప్పటి నుంచి విద్యార్థులు వివిధ రంగాల్లో ప్రావీణ్యత సాధిస్తున్నారన్నారు. ఇది ఓర్వలేక కొంతమంది మనువాదులు పనికట్టుకుని ఆరోపణల పర్వం మొదలెట్టారన్నారు.
అక్షరం, ఆర్థికం, ఆరోగ్యమనే ఎజెండాతో స్వేరో ముందుకెళ్తున్నదన్నారు. ఇటీవల స్వేరోకు వస్తోన్న స్పందన చూసిన కొంతమంది మనువాదులు తట్టుకోలేక, వారి పునాదులు ఎక్కడ కాదులుతాయోనాన్న భయం పట్టుకుందన్నారు. దేశంలో కొన్ని వర్గాలు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆశాస్త్రీయ విధానంతో ప్రజల్లో మూఢ విశ్వాసాలను పెంపొందించి సుఖమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఈ లాంటి మూర్ఖత్వాన్ని తొలగించడానికే స్వేరో కృషి చేస్తోందని, పేద, బడుగు, బలహీన వర్గాలను చదువు, పొదుపు, వైద్యం వైపు తీసుకెళ్లడమే స్వేరో ధ్యేయమని అన్నారు.
దేశంలో జరిగిన దళిత ఉద్యామాలను స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్న ప్రవీణ్ కుమార్ ను వ్యతిరేకిస్తున్నారంటే అంబేద్కర్ ఇజాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగానే భావిస్తున్నామని, ఆయన మీద ఈగ వాలనియ్యమని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుడిమల్ల సత్యం, పిట్ల మల్లేశం, దాచారం ఎల్లయ్య, అరుట్ల బాలయ్య, కటికం రవి, కొర్రీ శ్రీనివాస్, పోతుల మోహన్, చంద్రం, పిట్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.