'అంతకుమించి దైవంలేదు'

by Shyam |
అంతకుమించి దైవంలేదు
X

దిశ, సిద్ధిపేట: తల్లి పాల వారోత్సవాలను పురస్క రించుకుని రుస్తుం అర్ట్ గ్యాలరీలో సోమవారం అమృతమూర్తి “తల్లిపాలుశ్రేష్ఠం” క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సృష్టిలో అమూల్యం అమ్మ.. ప్రకృతిలో అమృతమూర్తిని మించిన దైవంలేదన్నారు.

తల్లులు బిడ్డలకు చనుపాలు ఇచ్చి పరిపూర్ణ మాతృత్వం అనుభవించాలనేదే తల్లీబిడ్డలకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆరోగ్యమంటూ అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తల్లీబిడ్డలకు ఇచ్చే ప్రోత్సాహకాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖ రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రుబీనారుస్తుం ఆయేషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story