- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారి డోఖా లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, నాగర్ కర్నూల్: శ్రీశైలంలో వరద జలాలు ముందస్తుగా రావడంతో ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లను ముందస్తుగా ప్రారంభించారు. ఈ తరుణంలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్వకుర్తి మూడో లిఫ్ట్ గుడిపల్లి వద్ద 29, 30వ ప్యాకేజ్ కు సంబంధించిన కాలువలకు సాగునీటిని వదిలారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి సాగునీటిని వదిలారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈసారి ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ శ్రీశైలం తిరుగు జలాలతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైతులకు వచ్చే యాసంగి పంటకు కూడా నీరు పుష్కలంగా అందించేలా ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేలు నీటి కాపాటిలా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎవ్వరూ అధైర్య పడకుండా కాలువలకు గండ్లు కొట్టే పరిస్థితి తీసుకురావద్దని పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఈ ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరితగతిన పూర్తిచేసి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రైతులకు సాగునీరు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి వెంట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తదితరులు హాజరయ్యారు.