ఏపీలో భారీగా పెరిగిన కరోనా రికవరీలు.. ఎంతంటే ?

by Anukaran |
corona
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 లక్షలు దాటింది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,226 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,00,877కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 45,533 సాంపిల్స్‌ను పరీక్షించగా 1,190 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,29,985 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో కొవిడ్‌ వల్ల 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తం కరోనా మృతుల సంఖ్య 13,998కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,110 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,24,895 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Advertisement

Next Story