గుజరాత్‌లో ఒక్కరోజే 20 మంది మృతి

by vinod kumar |
గుజరాత్‌లో ఒక్కరోజే 20 మంది మృతి
X

గుజరాత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశంలోనే కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 20 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 19 మరణాలు ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదు కావడంతో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం 347 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 8,542కు చేరింది. వీటిలో 6,086 కేసులు అహ్మదాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 513 మరణాలు సంభవించగా.. 2,780 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Advertisement

Next Story