నిజామాబాద్‌లో మూడ్రోజులుగా కరోనా కేసులు నిల్: కలెక్టర్ నారాయణ రెడ్డి

by Shyam |

దిశ, నిజామాబాద్: గత మూడ్రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని కలెక్టర్ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం మొత్తం 105 శాంపిల్స్ పంపించగా, శనివారం 44 రిపోర్ట్స్ రాగా అన్నీ నెగెటివ్ వచ్చాయన్నారు. మిగిలిన 61 రిపోర్టుల్లో సోమవారం 59 నెగెటివ్ వచ్చాయని, మరో రెండు శాంపిల్స్‌ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. అలాగే, శనివారం పంపించిన 64 శాంపిల్స్‌‌లో 51 నెగెటివ్ వచ్చాయని, మరో 13 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మొత్తం 15 రిపోర్టుల ఫలితాలు వెలువడాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ నెల 18న నిర్మల్‌కు చెందిన కరోనా పాజిటివ్ పేషెంట్‌‌ను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు సూచన మేరకు హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయినట్టు వైద్యాధికారులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని, ప్రైమరీ కాంటాక్ట్స్‌ వివరాలను నిర్మల్ జిల్లా యంత్రాంగానికి అప్పగించినట్టు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

Tags: no positive cases, nizamabad, collector narayana reddy

Advertisement

Next Story

Most Viewed