రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు 

by Shyam |
రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసు బలగాలు 
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ నేతలు యత్నం చేస్తున్నారు. దీంతో రాజ్ భవన్, గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్, తదితరులు గవర్నర్ ను కలిసేందుకు రెండు రోజుల నుండి ప్రయత్నిస్తున్నారు.

కాగా కాంగ్రెస్ నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వచ్చి రాజ్ భవన్ వద్ద రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అధికారులు ఎక్కువ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

Advertisement

Next Story

Most Viewed